ఎమ్యెల్యే జలీల్‌ఖాన్‌ తనయుడి వీరంగం..!

ఎమ్యెల్యే జలీల్‌ఖాన్‌ తనయుడి వీరంగం..!
x
Highlights

విజయవాడలో అర్ధరాత్రి వోక్స్‌ వేగన్‌ కారు బీభత్సం సృష్టించింది. పిన్నమనేని పాలీ క్లినిక్‌ దగ్గర అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...

విజయవాడలో అర్ధరాత్రి వోక్స్‌ వేగన్‌ కారు బీభత్సం సృష్టించింది. పిన్నమనేని పాలీ క్లినిక్‌ దగ్గర అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిలయన్స్‌ జియో ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు శాఖమూరి ప్రవీణ్‌ చౌదరి పేరుతో రిజిస్ట్రేషనై ఉంది. ఇక కారు నడుపుతున్న యువకుడు కృష్ణతేజను అరెస్ట్‌ చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమంటున్న బాధితులు.... కారులో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడు సాహుల్ ఖాన్‌ ఉన్నాడని ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడు సాహుల్‌ ఖాన్‌ అర్ధరాత్రి మాచవరం పోలీస్‌స్టేషన్‌లో వీరంగమాడాడు. స్నేహితులతో కలిసి పీఎస్‌కి వచ్చిన సాహుల్ ఖాన్‌ ఫొటోలు తీసిన కానిస్టేబుళ్లపై చిందులేశాడు. అయితే మీడియా కెమెరాలు చూడగానే అక్కడ్నుంచి జారుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories