మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నం

Highlights

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేశారు కుటుంబసభ్యులు. దాంతో సమాచారం అందుకున్న ICDS ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా...

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేశారు కుటుంబసభ్యులు. దాంతో సమాచారం అందుకున్న ICDS ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆ బాలిక 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు తనకు పెళ్లి చేస్తున్నారు.. తనకు చదువుకోవాలని ఉందంటూ.. బాలిక ICDS కు విన్నవించుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ప్రతినిధులు. అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే విషయం బయటకు తెలియడంతో.. కుటుంబసభ్యులు ఆ పుత్తడిబొమ్మను పిన్ని ఇంటికి పంపించి మరీ నోరు మూయించే ప్రయత్నం చేశారు. చివరకు సదరు బాలిక మీడియాను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories