ఏపీలో భారతీయ జగన్‌సేన పార్టీ

ఏపీలో భారతీయ జగన్‌సేన పార్టీ
x
Highlights

జ‌గ‌న్ - ప‌వ‌న్ - బీజేపీల పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. గుంటూరులో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ...

జ‌గ‌న్ - ప‌వ‌న్ - బీజేపీల పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. గుంటూరులో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌భ‌లో అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఏపీలో అవినీతి రాజ్య‌మేలుతుంద‌ని , అధికారంలో వ‌చ్చిన నాలుగేళ్ల‌లో టీడీపీ ఎన్ని అభివృద్ధి ప‌నులు చేసిందో చూపించాల‌ని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని సూచించారు. ఇసుక మాఫియా ఆట‌క‌ట్టించిన మ‌హిళా అధికారిణిపై దాడుల‌కు దిగడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు. సీఎం చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసు , ఆయ‌న కుమారుడు నారా లోకేష్ ఇసుక కాంట్రాక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి కేసులో హ‌స్తం ఉంది కాబ‌ట్టే పీఎం మోడీ టీడీపీకి అపాయిట్మెంట్ ఇవ్వ‌డంలేద‌నే స‌మాచారం త‌న వ‌ద్ద ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.
అయితే ఇన్నిరోజులు త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న ప‌వ‌న్ ఒక్క‌సారిగా రూటు మార్చ‌డంతో టీడీపీ నేత‌లు జ‌న‌సేనానిపై మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ‌స‌భ‌లో పీఎం మోడీ స్క్రిఫ్ట్ పంపిస్తే ..ప‌వ‌న్ యాక్ష‌న్ చేశార‌ని ఆరోపించారు.
తాము అలా చేశాం ఇలా చేశాం అని చెప్పిన ప‌వ‌న్ బీజేపీపై ఎందుకు విమ‌ర్శ‌లు చేయ‌లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఏపీకి అన్యాయం జ‌రుగుతుంటే మాట మాట్లాడ‌కుండా..కేంద్రంపై పోరాటం చేస్తున్న టీడీపీని ప్ర‌శ్నిస్తున్నార‌ని గంటా అన్నారు. లోకేష్ అవినీతిలో ఆరితేరార‌ని అని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని గంటా త‌ప్పు బ‌ట్టారు. లోకేష్ చేసిన అవినీతి ఏంటో చూపించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర విద్యాసంస్థ‌లు అద్దె భ‌వనాల్లో ఉంటే ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేద‌ని గంటా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
నాడు రాష్ట్రం విడిపోయి చిన్నాభిన్నం కావ‌డంతో త‌ప్ప‌ని స‌రిప‌రిస్థితుల్లో బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికామ‌ని తెలిపారు. బీజేపీ తో పొత్తుపెట్టుకుంటే న‌ష్ట‌మ‌ని తెలిసినా ..కలిసి వెళ్లామని గంటా చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు పోరాట మార్గం ఎంచుకున్నారని, టీడీపీ నిర్ణయం చరిత్రాత్మకమైందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నిర్ణయం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా గంటా శ్రీనివాసరావు విమర్శణాస్త్రాలు సందించారు. రాష్ట్రంలో బీజేపీ అంటే భారతీయ జగన్‌సేన పార్టీగా మారిందని విమర్శించారు. వైసీపీ మునిగిపోతున్న నావ అని, తన వ్యవహార శైలితో జగన్ తనకు తానే సెల్ఫ్‌గోల్ వేసుకున్నారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories