జ‌గ‌న్ ఆ ఊర‌పంది ఆలోచ‌న‌ల్ని మానుకో

జ‌గ‌న్ ఆ ఊర‌పంది ఆలోచ‌న‌ల్ని మానుకో
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి నిప్పులు చెరిగారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు ఆదినారాయ‌ణ‌రెడ్డి - ...

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి నిప్పులు చెరిగారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు ఆదినారాయ‌ణ‌రెడ్డి - రామ‌సుబ్బారెడ్డి లు ఇద్ద‌రు త‌మ ప‌నుల్లో చెరో అర్ధ రూపాయి చొప్పున పంచుకోమ‌ని చెప్పారంటూ ఓ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. ఆవీడియో పై స్పందించిన ఆదినారాయ‌ణ రెడ్డి చంద్ర‌బాబు చెబితే తాము పంచుకునేంత నీచులమా...! తాను, రామసుబ్బా రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టినా సీఎం అంగీకరిస్తామని చెప్పారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కానీ వాటాల గురించి మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. తాము వాటాలు పంచుకునేంత నీచంగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు.
వైఎస్ హ‌యాంలో ఐఏఎస్ ల‌ను ప్ర‌లోభ‌పెట్టిన జ‌గ‌న్ వారిని ముంచార‌ని అన్నారు. అలాంటి జ‌గ‌నే ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూర‌మ‌ని మండిప‌డ్డారు. 13కేసుల్లో నిందితుడిగా ఉన్న జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డిలు అధికారుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గద‌ని , అయినా ఇలాంటి వారు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చ‌రిత్ర‌లో లేద‌ని చెప్పుకొచ్చారు.
బీజేపీ తో పొత్తుగురించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఆదినారాయ‌ణ‌రెడ్డి ముందు జ‌గ‌న్ ఆ ఊర‌పంది ఆలోచ‌న‌ల్ని మానుకోవాల‌ని హితువు ప‌లికారు. అలాంటి ఆలోచ‌న‌ల వ‌ల్లే పీఎం మోడీకి నోటిసులు అందాయ‌ని అన్నారు. అయినా త‌మ‌ను ను విమ‌ర్శించే శ‌క్తి కోల్పోయార‌ని సూచించారు.
ఇప్ప‌టికే ఏ2 నిందితుడుగా ఉన్న విజ‌యిసాయిరెడ్డికి రాజ్య స‌భ అవ‌కాశం క‌ల్పించార‌ని ఈ సారి ఏ3కి అవ‌కాశం ఇస్తారా అని ప్ర‌శ్నించారు.
ఇక ప్ర‌తీ శుక్ర‌వారం జ‌గ‌న్-విజ‌య‌సాయిరెడ్డి చేతులుక‌ట్టుకొని కోర్టుకు వెళుతున్నార‌ని , రాయలసీమలో హైకోర్టు కోసం లాయర్లు పోరాడుతున్నారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories