సంచలనం: మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత!

సంచలనం: మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత!
x
Highlights

భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ...

భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తులో 226 మంది సాక్ష్యుల్లో 60 మంది ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. మొత్తం 10 మంది నిందితులలో ఐదుగురి పేర్లను మాత్రమే చార్జీషీట్‌లో ఎన్‌ఐఏ చేర్చింది. అయితే ఆ ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం కోర్టు తీర్పు ఇచ్చింది.

2007 మే 18 తేదీన మధ్యాహ్నాం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్‌ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్‌ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్‌లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలెర్ట్ ప్రకటించిన పోలీస్‌ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది.

ఎన్‌ఐఏ సమర్పించిన జాబితాలో నిందితులు పేర్లు...
A-1. దేవేందర్ గుప్తా
A-2.లోకేష్ శర్మ,
A-6.స్వామి ఆసీమనందా
A-7.భరత్ భాయ్
A-8.రాజేందర్ చౌదరి
పరారీలో ఉన్న వారు.
A-3.సందీప్ డాంగే
A-4.రామచంద్ర కళా సంగ్రా
A-10.అమిత్ చౌహన్.

ఈ కేసులో చనిపోయిన వ్యక్తి.
A-5.సునీల్ జోషి.

ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు
A-6 .స్వామి ఆసీమనందా
A-7.భరత్ భాయ్.
A-9.తేజ్ పరమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories