పెళ్లి చేసుకోండి..లేదంటే అంతే సంగతులు

Highlights

పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా లీడ్ చేయోచ్చు. పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయి. పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి తెలుసుకోనేందుకు...

పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా లీడ్ చేయోచ్చు. పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయి. పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి తెలుసుకోనేందుకు కొన్నిసంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఆ సర్వేల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పెళ్లంటే.. ఆమడ దూరం పరిగెడుతున్నారా? సంసార సాగరం ఈదడం కంటే.. ఒంటరి ప్రయాణమే బెటర్ అని ఫీలవ్వుతున్నారా? అయితే, జాగ్రత్త జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఔను, నిజమే! ఇది ఓ అధ్యయనం ద్వారా బహిర్గతమైన వాస్తవం. 8,00,000 మందిపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పెళ్లి మీ చిత్తుశుద్ధికి పరీక్ష కావచ్చు. కానీ, వృద్దాప్యం వరకు జీవితభాగస్వామి వెంట ఉంటే జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చట. జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయేవారు అల్జీమర్స్ బారిన పడే ప్రమాదమే కాకుండా, జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.

భర్త చనిపోయాక ఒంటరిగా మిగిలిపోయే మహిళల్లో కూడా ఇలాంటి అవకాశాలు దాదాపు 20 శాతం ఉన్నట్లు తెలిసింది. లండన్ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్ట్ అండ్రూ సమ్మెర్లాడ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్జిమర్ల సమస్య పెళ్లికానివారిలోనే ఎక్కువగా కనిపిస్తోంది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసేవారి కంటే.. పెళ్లి చేసుకున్నవారికే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తెలిసింది. న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురించారు.

వివాహం జరిగి... సెక్సువల్ జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవారు భవిష్యత్తులోనూ చురుగ్గా ఉంటారని పరిశోధకులు తెలిపారు. అయితే, ఒంటరిగా జీవించేవారిలో సెక్స్‌వల్ లైఫ్ క్రమబద్ధంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. పెళ్లి సాంప్రదాయాలు, లైఫ్‌స్టైల్‌ తదితర విషయాలు కూడా వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. బాధ్యతలు, భవిష్యత్తుపై ఆలోచన, ఆర్థిక భద్రత తదితర విషయాలు పెళ్లయినవారిని నిత్యం చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సో, ఒంటరిగా మిగిలిపోకుండా.. జీవితానికి ఓ తోడు ఉంటే జీవితం పరిపూర్ణమేనని పరిశోధకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories