పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ. నడిచిన తండ్రి

పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ. నడిచిన తండ్రి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను వణికించిన తితలీ తుఫాన్ ఒడిశా లోని గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. ఈ జిల్లాలో తుఫాను దాటికి సర్వం కోల్పోయిన...

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను వణికించిన తితలీ తుఫాన్ ఒడిశా లోని గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. ఈ జిల్లాలో తుఫాను దాటికి సర్వం కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో అతంక్‌పూర్‌ గ్రామానికి చెందిన ముకుంద్ కుటుంబం కూడా ఒకటి. నాలుగురోజుల క్రితం ముకుంద్ తన పదకొండేళ్ల కూతురు బబిత కనిపించకుండా పోయింది. అయితే ఆమె గ్రామానికి సమీపంలో కొండచరియలు విరిగి మృతిచెందినట్టు తెలిసింది. దాంతో కూతురు మృతితో కన్నీరు మున్నీరైనా ముకుంద్ తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఫొటోలు తీసుకుని... పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్‌కు తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ముకుంద్ కుటుంబం. ఇక చేసేది లేక ముకుంద్.. బబిత మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని హాస్పిటల్‌కు బయలుదేరాడు. 8కిమీ.లు నడిచిన తర్వాత కొందరు స్థానికులు ఈ విషయంపై ఆరాతీస్తే.. వాహనం సమకూర్చుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. ఇలా రావలసి వచ్చిందని చెప్పాడు. దాంతో చలించిన గ్రామస్థులు కొందరు.. వెంటనే వాహానం ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించారు. బబిత ఘటనపై విమర్శలు చెలరేగడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories