బ్యాగ్‌లో 50 మానవ అస్థిపంజరాల అక్రమ రవాణా

బ్యాగ్‌లో 50 మానవ అస్థిపంజరాల అక్రమ రవాణా
x
Highlights

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మానవ అస్థిపంజహారాలను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీ నుంచి బలియా వెళ్లే బలియా- సీల్దా...

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మానవ అస్థిపంజహారాలను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. యూపీ నుంచి బలియా వెళ్లే బలియా- సీల్దా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సంజయ్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి ఓ భారీ బ్యాగుతో రైల్లో కూర్చున్నాడు. అతడి దగ్గర ఏదో తెలియని దుర్వాసన రావడంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందితో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సదరు వ్యక్తి వద్దనున్న బ్యాగును తెరిచి చూడగా అందులో అస్థిపంజరాలు కనపడ్డాయి. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం 50 అస్థిపంజరాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 16 పుర్రెలు,34 కాలి ఎముకలను గుర్తించారు. భూటాన్‌లో మానవ అస్థిపంజరాలకు భారీ డిమాండ్‌ ఉంది. వైద్య, శాస్త్రీయ పరిశోధనల్లో భాగంగా విద్యార్థులు వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ అస్థిపంజరాలను చైనా గుండా భూటాన్‌ తరలించేందుకు సంజయ్‌ పథకం రచించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. కాగా ఈ వ్యక్తి బీహార్ కు చెందిన స్మగ్లింగ్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories