రైతుల రుణ మాఫీ ఎందుకు చేస్తున్నారు?

రైతుల రుణ మాఫీ ఎందుకు చేస్తున్నారు?
x
Highlights

పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రైతు రుణమాఫీపై ధ్వజమెత్తారు. ఇటివలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాహోరీ నరాలుతెగే ఉత్కంఠ పోరులో...

పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రైతు రుణమాఫీపై ధ్వజమెత్తారు. ఇటివలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాహోరీ నరాలుతెగే ఉత్కంఠ పోరులో మూడు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఇటివలే కొలువుదీరిన కొద్దిగంటలకే రైతు రుణాల మాఫీపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే కాగా ఈ రుణామాఫీలపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఈ రుణమాఫీలు క్షేత్రస్థాయిలో ఆన్నదాతలకు మేలే చేసిందా లేదా అన్న అంశంపై తాను మూడు రాష్ట్రాలల్లో వివరాలను క్లుప్తంగా సేకరిస్తున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించింది. రైతులకు బీమా పథకంపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మమతా బెనర్జీ తాజాగా రైతు రుణామాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్నివిమర్శలు గుప్పించారు. అయితే మమతా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత రాహుల్ సిన్హా తొసిపుచ్చారు. ఆమే ఏమాత్రం విలువ లేని సీఎం అని, ఆమే అసలు ఏ పనిచేయకుండా చేసే వాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్నారు అనడానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories