క‌త్తి మ‌హేష్ చేతిలో వీడియోలు , ఫోటోలు

క‌త్తి మ‌హేష్ చేతిలో వీడియోలు , ఫోటోలు
x
Highlights

ప‌వ‌న్ - క‌త్తి మ‌హేష్ వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రైట‌ర్ కోన వెంక‌ట్ ప్ర‌య‌త్నించాడు. క‌త్తి ప్రెస్ మీట్ అనంత‌రం ఈనెల 15వ‌ర‌కు వెయిట్ చేయండి....

ప‌వ‌న్ - క‌త్తి మ‌హేష్ వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రైట‌ర్ కోన వెంక‌ట్ ప్ర‌య‌త్నించాడు. క‌త్తి ప్రెస్ మీట్ అనంత‌రం ఈనెల 15వ‌ర‌కు వెయిట్ చేయండి. క‌త్తిమ‌హేష్ గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కానీ, జ‌న‌సేన అభిమానులు కానీ కామెంట్ చేయోద్ద‌ని సూచించాడు. ఇక క‌త్తిమ‌హేష్ లైవ్ డిబెట్ల‌లో ప‌వ‌న్ గురించి మాట్లాడొద్ద‌ని ..అలా చేస్తే వివాదానికి ప‌రిష్క‌రించే దిశ‌గా ప్ర‌యత్నాలు చేస్తాన‌ని చిన్న హింట్ ఇచ్చాడు. కోన హింట్ స‌రే క‌త్తి మ‌హేష్ సంగ‌తేంటీ. కోన 15వ‌ర‌కు వెయిట్ చేయండి అంటే క‌త్తి మ‌హేష్ మాత్రం 16దాకా ఆగండి అంటూ కౌంట‌ర్ ఇవ్వ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఇదిలా ఉంటే 16న క‌త్తి ఏం చేయ‌బోతున్నాడు. కోన వెంక‌టే ఏం చెబుతాడు అనే విష‌యం పై కొన్ని అంచనాలు ఉన్నాయి. వాటిలో డైర‌క్ట‌ర్ గా ఉన్న క‌త్తిమ‌హేష్ ను టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి బ్యాన్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. దాని గురించే ప్రొడ్యూస‌ర్ కౌన్సెల్, డైర‌క్ట‌ర్ల క‌మిటి స‌భ్యులు చ‌ర్చించుకుంటున్న‌ట్లు టాక్. ఇక కత్తి మహేష్ తాను చెప్పిన 16వ తేదినాడు కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసే అవకాశం ఉందని వార్త. అదే జరిగితే మరింత కలకలం రేగడం ఖాయమ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories