కత్తి చూపు..ఏపీ సర్కారు వైపు

కత్తి చూపు..ఏపీ సర్కారు వైపు
x
Highlights

నిన్న మొన్నటి వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన కత్తి మహేష్, తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకున్నారు....

నిన్న మొన్నటి వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన కత్తి మహేష్, తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసుకున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పేరిట విడుదలైన ఆదేశాలను ప్రశ్నించాడు. జనవరి 1న దేవాలయాలకు అలంకరణలు వద్దని, నూతన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమవుతుందని, క్రీస్తు శకాన్ని అనుసరించి జనవరి 1న పండుగ చేసుకోవడం సముచితం కాదని, ఆలయాల్లో పండగ వాతావరణం సృష్టించొద్దని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మహేశ్‌ కత్తి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆయన స్పందించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు !’ అని మహేశ్‌ కత్తి పోస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories