ఏ హీరో కెరియ‌ర్ లో ఇలా జ‌రిగుండ‌దేమో

ఏ హీరో కెరియ‌ర్ లో ఇలా జ‌రిగుండ‌దేమో
x
Highlights

ప్రిన్స్ మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారం...

ప్రిన్స్ మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నార‌ని , అందుకు ప్రిన్స్ అభిమానులు సిద్ధంగా ఉండాల‌ని డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ పిలుపునిచ్చారు. డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ - ప్రిన్స్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది. సాదార‌ణంగా సినిమా ఫ‌స్ట్ లుక్ అంటే ఓ ఇమేజ్ ను విడుద‌ల చేస్తారు. కానీ ఆ సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న‌పెట్టిన కొర‌టాల వినూత్నంగా భ‌ర‌త్ అను నేను ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నారు. టైటిల్ లోగోతో పాటూ మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను తొలిసారి జనవరి 26న విడుదల చేయబోతున్నారు. సో... అభిమానులంతా సిద్ధంగా ఉండాలంటూ దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్లో కోరారు.
కాగా కొర‌టాల ట్విట్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. గూగుల్ ఇండియా ట్రెండ్స్ లో ఈ విషయం రెండో స్థానంలో నిలిచింది. దీనిని బట్టి చూస్తుంటే భరత్ అను నేను ఆడియో కూడా రికార్డు నెలకొల్పడం ఖాయమ‌ని మ‌హేష్ బాబు అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories