లోక్‌సభలో మళ్లీ అదే సీన్‌.. నిమిషం లోపే వాయిదా

లోక్‌సభలో మళ్లీ అదే సీన్‌.. నిమిషం లోపే వాయిదా
x
Highlights

లోక్‌‌సభ ప్రారంభమైన సరిగ్గా 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా పడింది. లోక్‌సభలో నాల్గోసారి అవిశ్వాసంపై టీడీపీ, వైసీపీ నోటీసులిచ్చింది. సభ సజావుగా లేదంటూ...

లోక్‌‌సభ ప్రారంభమైన సరిగ్గా 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా పడింది. లోక్‌సభలో నాల్గోసారి అవిశ్వాసంపై టీడీపీ, వైసీపీ నోటీసులిచ్చింది. సభ సజావుగా లేదంటూ ఇప్పటికే 3సార్లు అవిశ్వాసంపై స్పీకర్ చర్చ చేపట్లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఏపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఇవాళ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగించారు. పదే పదే సభ్యులకు స్పీకర్ చెప్పినప్పటికీ వారు మాత్రం మరింత ఆందోళన ఉదృతం చేయడంతో చేసేదేమీలేక సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12గంటలకు సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్రంలోని ఎన్‌డీయే సర్కార్‌పై టీడీపీ, వైసీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories