లాంచీ ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన నిజాలు

లాంచీ ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన నిజాలు
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర లాంచీ గోదావరిలో మునిగి 25 మంది జల సమాధి అయ్యారు. మరో 16 మంది ప్రాణాలతో...

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర లాంచీ గోదావరిలో మునిగి 25 మంది జల సమాధి అయ్యారు. మరో 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రిపూట కావడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి గల్లంతయిన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టబోతున్నారు. అయితే బోటులో మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయంపై క్లారిటీ రాలేదు.

పోలవరం నుంచి ప్రయాణికులతో కొండమొదలు వెళ్తోన్న లాంచీ.. మంటూరు దగ్గరికి వచ్చేసరికి భారీ ఈదురు గాలులు వీచాయి. దీంతో నదిలో అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో సుమారు 50 మంది వరకు ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం నుంచి 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయిన వారికోసం వెంటనే గాలింపు చేపట్టినా..భారీ వర్షం, ఈదురుగాలులు, చీకటి కారణంగా సహాయక చర్యలు ఆటంకం కలిగింది.

కొండమొదలుకు చెందిన ఉపాధిహామీ కూలీలు... బ్యాంకు ఆధార్ లింకేజీ కోసం గిరిజనులు దేవిపట్నం వెళ్లారు. తిరిగి లాంచీలో వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి బలంగా వీస్తుందనే కారణంగా లాంచీ తలుపులు మూసివేయడంతో పాటు కంగారులో ప్రయాణికులంతా ఒకవైపుకు చేరుకోవడం ప్రమాదానికి కారణమైంది. సుడిగాలికి బోటు ఒక్కసారిగా తలకిందులై నీట మునిగింది. ఈ ప్రమాదానికి లాంచీ డ్రైవర్ నిర్లక్ష్యామే కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. బోటును ఆపమని ఎంత మొత్తుకున్న వినలేదని తెలిపారు.

బోటులోని ప్రయాణికులంతా గోదావరి తీర గ్రామాలైన తాళ్ళూరు, గొందూరుః,కత్తులూరు, పెడితేరు,పెద్దగూడెం గిరిజనులు
. వీరందరీకీ ఈతవచ్చు. అయితే లాంచీ తలుపులు మూసివేసి ఉండడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. భోటు పేన ఉన్న 16 మందిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరికొందర్ని స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడినవారిలో ముగ్గురు బోటు సిబ్బంది కూడా ఉన్నారు. లాంచి యజమాని ఖాజావలీదేవీపట్నం పోలీస్టేషన్ లో లొంగి పోయాడు.

ప్రమాదం జిరిగిన వెంటనే 20 బోట్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. ప్రమాద స్థలాన్నితూర్పుగోదావరి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో ఎస్పీ, రంపచోడవరం ఏఎస్పీ పరిశీలించారు. గోదావరిలో 70 అడుగుల లోతులో బోటును గుర్తించినట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఉదయం నుంచి నేవీ హెలీకాఫ్టర్‌ను ఉపయోగిస్తామని చెప్పారు. అయితే బోటు పూర్తి కండిషన్‌లో ఉందని నిన్న ఉదయమే అధికారులు భద్రతా పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారని వివరించారు. గోదావరిలో మునిగిన బోటును వెలికి తీస్తే కానీ ఎంత మంది గల్లంతయ్యారనే విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories