చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ ..పవన్ జనసేన ప్రీపేయిడ్ పార్టీ

చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ ..పవన్ జనసేన ప్రీపేయిడ్ పార్టీ
x
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై టీడీపీ నేత‌లు సంద‌ర్భాను సారం గుర్తు చేసుకొని మ‌రి తిట్టిపోస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బాగున్నా ఆ ఇరుపార్టీలు ఇప్పుడు ఒక‌రంటే...

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై టీడీపీ నేత‌లు సంద‌ర్భాను సారం గుర్తు చేసుకొని మ‌రి తిట్టిపోస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బాగున్నా ఆ ఇరుపార్టీలు ఇప్పుడు ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. ఎదురు ప‌డితే చాలు అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నారు.
ఏపీ జరిగే అవినీతిపై సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించ‌న‌న్న ప‌వ‌న్ ఆ పార్టీపై గుంటూరులో జ‌రిగిన స‌భ‌లో మండిప‌డ్డారు. లోకేష్ అవినీతి, చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసు, దుర్గ‌గుడిలో ఎమ్మెల్యే క‌లెక్ష‌న్లు, ఇసుక మాఫియాలో బాగ‌స్వామం అంటూ తూర్పార‌బ‌ట్టారు. అయితే ప‌వ‌న్ త‌మ‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌తో టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప‌వ‌న్ ఏం మాట్లాడ‌తారా..? ఎలా ఇరుకున పెట్టాలా అని ఎదురు చూస్తున్న తెలుగు త‌మ్ముళ్లు జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.
లోక్ స‌భ‌లో ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని డిమాండ్ వినిపిస్తున్నాయి. అయితే స‌భ‌లో ఆర్డ‌ర్ లేనందుకు చ‌ర్చ‌కు రావ‌డంలేద‌ని స్పీక‌ర్ వాయిదా వేస్తున్నారు. ఈనేప‌థ్యంలో టీడీపీ నేత‌లు కేంద్రంతీరుపై మండిప‌డుతున్నారు. కావాల‌ని స‌భ ఆర్డ‌ర్ లేద‌ని చెప్పి వాయిదా వేస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఆరోపిస్తున్నారు. బీజేపీకి పోయే కాలం వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందన్నారు.
సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడాన్ని కేశినేని నాని తప్పుబట్టారు. సభను ఆర్డర్‌లో ఉంచాల్సిన బాధ్యత సభాపతిదే అని చెప్పారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశ్యం కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు. ఆ ఆలోచన ఉండి ఉంటే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎంపీలతో మాట్లాడేవారని తెలిపారు.
తాము రోజుల తరబడి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ నుంచి స్పందన లేదన్నారు. తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అందరూ గమనిస్తున్నారని తెలిపారు. నాడు కాంగ్రెస్ చేసిన తప్పునే ఇప్పుడు బీజేపీ చేస్తోందన్నారు.
టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై చర్చించాల్సిందేనని టీడీపీ ఎంపీలు అన్నారు. కావాలనే టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, సభలో చర్చ జరిగితే ఆ రాష్ట్రాల సమస్యలు కూడా చర్చించవచ్చునని చెప్పారు.
ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ అని, పవన్ జనసేన ప్రీపేయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్నారు. అలాంటి సమయంలో తన అన్నయ్య చిరంజీవిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
నాడు అన్నను ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విమర్శించడం సరికాదని కేశినేని నాని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories