ఎంపీ భార్య‌పై ఎమ్మెల్యే కుమారుడి లైంగిక వేధింపులు

ఎంపీ భార్య‌పై ఎమ్మెల్యే కుమారుడి లైంగిక వేధింపులు
x
Highlights

ఆ ఎంపీ భార్య స‌ద‌రు ఎమ్మెల్యే కొడుకుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రైలు ప్ర‌యాణంలో తన కాళ్ల‌ను నాలుగు సార్లు ప‌ట్టుకున్నాడ‌ని, కావాల‌నే త‌న కాళ్ల‌ను...

ఆ ఎంపీ భార్య స‌ద‌రు ఎమ్మెల్యే కొడుకుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రైలు ప్ర‌యాణంలో తన కాళ్ల‌ను నాలుగు సార్లు ప‌ట్టుకున్నాడ‌ని, కావాల‌నే త‌న కాళ్ల‌ను తాకిన‌ట్లు ఆ ఎంపీ భార్య త‌న జీవిత చ‌రిత్ర‌లో రాసుకొచ్చింది. ఇప్పుడు ఆమె రాసిన జీవిత చ‌రిత్ర‌లో కొన్ని అంశాలు వివాదాస్ప‌ద మ‌య్యాయి.
కేర‌ళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కేఎం. మ‌ణి కుమారుడు , ఎంపీ జోస్ మ‌ణి భార్య నిశాజో్స్ త‌న జీవితం ఆధారంగా The Other Side of This Life అనే పుస్తకం రాశారు. ఆ పుస్త‌కంలో త‌న జీవితం గురించి , ఎదురైన లైంగిక వేధింపుల గురించి స్ప‌ష్టంగా వివ‌రించారు.
2016 ఆగ‌స్ట్ లో తిరువ‌నంత‌పురం నుంచి రైలులో ప్ర‌యాణిస్తుండ‌గా లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు తెలిపారు. మ‌న దేశంలోమ‌హిళ‌ల‌కు బ‌ద్ర‌త లేద‌ని త‌నకు ఎదురైన చేదు అనుభ‌వాన్ని పుస్తకంలో పేర్కొంది. ఓ ఎమ్మెల్యే కుమారుడు , యూడీఎఫ్ పార్టీకి చెందిన ఓ వ్య‌క్తి త‌న కాలును ఉద్దేశ పూర్వ‌కంగా ప‌ట్టుకున్నాడ‌ని నిశాజోస్ ఆరోపించారు. అనంత‌రం ఇంటికి వెళ్లి ట్రైన్ జ‌రిగిన ఘట‌న పై ఇంటికి వెళ్లి జరిగిన విషయం తన భర్త జోస్ మణికి, కుటుంబ సభ్యులకు చెప్పానని నిశా జోస్ వివరించారు.
ఇదిలా ఉంటే నిశాజోస్ పేరు చెప్ప‌క‌పోయినా కేర‌ళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ కుమారుడు శాన్ జార్జ్..నిశాజోస్ త‌నని అప్ర‌తిష్ట‌పాలు చేస్తుందంటూ కోర్టును ఆశ్ర‌యించాడు. రాజకీయ లబ్దికోసం నిశా జోస్ ఆరోపణలు చేస్తుంద‌ని ఆమె మీద శాన్ జార్జ్ పరువునష్టం దావా వేశాడు. మిసెస్ కేరళ కేరళ ఎంపీ జోస్ మణి సతీమణి నిశా జోస్ ఒక్కసారి కేరళ మిసెస్ గా ఎంపిక అయ్యారు. నిశా జోస్ లైంగికవేధింపుల ఆరోపణలు, ఎమ్మెల్యే పీసీ. జార్జ్ కుమారుడు శాన్ జార్జ్ కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories