కీర్తీసురేష్ కూడా మొద‌లు పెట్టిందా

కీర్తీసురేష్ కూడా మొద‌లు పెట్టిందా
x
Highlights

నేను శైల‌జ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బొద్దుగుమ్మ కీర్తి సురేష్ . తొలి చూపులోనే తెలుగు ఆడియన్స్ ఈమెకు ఫిదా అయిపోయారు. చూడముచ్చటైన ఆమె చిరునవ్వు,...

నేను శైల‌జ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బొద్దుగుమ్మ కీర్తి సురేష్ . తొలి చూపులోనే తెలుగు ఆడియన్స్ ఈమెకు ఫిదా అయిపోయారు. చూడముచ్చటైన ఆమె చిరునవ్వు, అమాయకత్వంతో కూడుకున్న నటన అందరిని ఆకట్టుకున్నాయి.
కీర్తి సురేష్ ఆ తరువాత నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ఈ బొద్దు గుమ్మ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కానీ అజ్ఞాతవాసి చిత్ర ఫలితంతో కీర్తికి నిరాశే మిగిలింది. అయినా కూడా ఇప్పటికి కీర్తి సురేష్ క్రేజీ హీరోయినే. సావిత్రి బయోపిక్ మహానటి వంటి బిగ్ ప్రాజెక్ట్ కీర్తి చేతుల్లో ఉంది.
ఈ బొద్దు గుమ్మ క్యారక్టర్ మీద ఎలాంటి రిమార్క్స్ టాలీవుడ్ లో వినిపించలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హీరోయిన్ల గురించి మీడియాలో తరచుగా కొన్ని వార్తలు, పుకార్లు వస్తుంటాయి. అన్ని పుకార్లు నమ్మశక్యంగా ఉండవు. కీర్తి సురేష్ గురించి కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఓ వార్త షాక్ కి గురిచేస్తోంది. కానీ ఇది నిజం అని నొక్కి మరి చెబుతున్నారు. కీర్తి సురేష్ సీనియర్ నటుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు సమాచారం. షూటింగ్ లో క్యార్ వాన్ నుంచి ఒక పట్టాన బయటకు రాదట. కీర్తి కోసం దర్శకుడి నుంచి సీనియర్ నటుల వరకు అంతా పడిగాపులు కాస్తున్నా కీర్తి మాత్రం ఆలస్యంగా క్యార్ వాన్ దిగుతుందని అంటున్నారు.
కీర్తి ఇలా ప్రవర్తించడానికి కారణం ఆమెలో స్టార్ హీరోయిన్ అనే భావన పెరిగిపోవడం వల్లనే అని కోలీవుడ్ వర్గాలు విమర్శలు గుపిస్తున్నాయి. మేకప్ పేరుతో గంటల తరబడి క్యార్ వాన్ లోనే ఉండిపోతే షూటింగ్ పరిస్థితి ఏంటని కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అంతర్గతంగా కీర్తి గురించి విమర్శలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories