ప్ర‌త్యేక‌హోదా కోసం ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం

ప్ర‌త్యేక‌హోదా కోసం ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం
x
Highlights

ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్...

ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని టీడీపీ- వైసీపీ నేత‌లు పోరాటం చేస్తున్నారు. కానీ శూన్యం ఫ‌లితం . ఆరంభ‌సూర‌త్వంలా త‌మ పార్టీ ప్ర‌జ‌ల‌కోసం ప‌నిచేస్తుంద‌ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సాధిస్తాం అని మంగ‌మ్మ‌శ‌ఫ‌దాలు చేస్తున్నారే త‌ప్పా..సాధించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డంలేదు.
ఈ నేప‌థ్యంలో హ‌స్తిన‌లో ఏపీ త‌రుపున పోరాటం చేస్తున్న కొంత‌మంది నాయ‌కులు తమ‌ రాజ‌కీయం కోసమే త‌ప్పా. ప్ర‌జ‌ల‌కోసం కాదంటూ త‌ల‌సాని మండిప‌డ్డారు. అలాంటి వారిలో పోరాట స్పూర్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటే వారికి కేసీఆర్ వారికి నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని సూచించారు.
ఈ సంద‌ర్భంగా నాడు రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం అక్క‌డి ప్ర‌జ‌ల్ని మోసం చేస్తుంద‌ని ఆరోపించారు. ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకే త‌ప్పా ప‌స‌లేద‌ని అన్నారు.
ప్ర‌త్యేక‌రాష్ట్రం కోసం పోరాటం చేసే స‌మ‌యంలో పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారని… ఇప్పుడు ఏపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఎన్డీఏకు బలం ఉన్న సమయంలో నోకాన్ఫిడెన్స్ మోషన్‌తో సాధించేది ఏముందన్న తలసాని… పార్లమెంట్‌లో టీఆర్ఎస్ గొడవ చేయొద్దని ఎవరైనా మాట్లాడారా?… ఏపీది న్యాయమైన కోరికే అని జితేందర్ రెడ్డి, కవిత లోక్‌సభలో చెప్పారు… ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం తప్ప ఎవరితోనైనా మాట్లాడారా? మండిపడ్డారు.
ఆపరేషన్లను నమ్మెంత అమాయకంగా ప్రజలు లేరన్నారు తలసాని… అవిశ్వాసం ఎందుకో అందరికీ తెలుసని… వాళ్లు చేయాల్సింది వెంటనే 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. వారికీ చిత్తశుద్ధి లేదు, ప్లానింగ్ లేదని విమర్శించిన తలసాని… ప్రత్యేక హోదా డిమాండ్ ను నీరుగారుస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… పీఎంవోలో తిరగడం ఏంటి? సుజనా చౌదరి.. అరుణ్‌జైట్లీని కలవడం ఏంటి? అని ప్రశ్నించిన తలసాని… ఏ2 విజయసాయి పీఎంవోలో ఎలా తిరుగుతాడని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు… మరి ఏ1 నీ సభలో కూర్చుకుంటే నువ్వు అసెంబ్లీలో ఎలా ఉంటావని చంద్రబాబును ఎదురు ప్రశ్నించారు తలసాని.

Show Full Article
Print Article
Next Story
More Stories