హే..క‌త్తిమ‌హేష్ మళ్లీ ఏసేసాడు..!

హే..క‌త్తిమ‌హేష్ మళ్లీ ఏసేసాడు..!
x
Highlights

వివాదం ముగిసింద‌నుకుంటే మ‌ళ్లి మొద‌టికి వ‌స్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఐదు నెల‌లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు , క‌త్తిమ‌హేష్ ల...

వివాదం ముగిసింద‌నుకుంటే మ‌ళ్లి మొద‌టికి వ‌స్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఐదు నెల‌లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు , క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరింది. క‌త్తి మ‌హేష్ , ప‌వ‌న్ రాజ‌కీయాలు, సినిమాల గురించి సంద‌ర్భాను సారం విమ‌ర్శ‌లు చేసేవాడు. ఆ విమ‌ర్శ‌లు కాస్త వ్య‌క్తిగ‌త జీవితాల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చాయి. అయితే ఈ నేప‌థ్యంలో ఓ టీవీ ఛాన‌ల్ డిబెట్ లో పాల్గొనేందుకు వెళుతుండ‌గా క‌త్తిమ‌హేష్ పై ప‌వ‌న్ అభిమానులు కోడి గుడ్ల‌తో దాడి చేశారు. ఆ దాడి కాస్త తీవ్ర‌త‌రం కావ‌డంతో పెద్ద‌మ‌నుషులు జోక్యం చేసుకొని ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చారు. ఆ రాజీ కుదిరిందే కానీ మ‌హేష్ మాత్రం త‌న క‌త్తికి ప‌దును పెట్టి మ‌రి ప‌వ‌న్ విమ‌ర్శలు చేస్తూ వ‌స్తున్నాడు.
ప‌వ‌న్ తాజాగా ఆంధ్రా, తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌లు చేసున్న విష‌యం తెలిసిందే. ఈ పర్య‌ట‌న‌ల్లో ఇరు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల్ని సమ‌ర్ధిస్తూ వారి పాల‌న‌కు మ‌ద్ద‌తు నిలుస్తున్నారు. ఇది ప్రతిప‌క్షాల‌కు మింగుడు ప‌డ‌డంలేదు. సీఎం ల ప‌నితీరు బాగుంటే ప‌వ‌న్ ఎందుకు ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వారి బాట‌లో క‌త్తిమ‌హేష్ వ‌చ్చి చేరాడు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌పై క‌త్తి ఇలా ట్వీట్ చేస్తూ ఓ స‌ల‌హా ఇచ్చాడు.

తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు.
చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన ఆల్ట్ర‌నేటీవీగా ప్రాజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాలసిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories