పీఎం మోడీని కాల్చేయాలంటూ క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

పీఎం మోడీని కాల్చేయాలంటూ క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?
x
Highlights

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పీఎం మోడీపై విరుచుకుపడ్డారు. గ‌తంలో జగన్ అక్రమాస్తుల కేసులో పీఎం మోడీ పేరు బయటకు వచ్చింది. దీంతో క‌త్తి మోడీని విమ‌ర్శిస్తూ...

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పీఎం మోడీపై విరుచుకుపడ్డారు. గ‌తంలో జగన్ అక్రమాస్తుల కేసులో పీఎం మోడీ పేరు బయటకు వచ్చింది. దీంతో క‌త్తి మోడీని విమ‌ర్శిస్తూ ములిగేనక్క మీద తాటికాయ పడటం అంటే ఇదేనంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారంతో ఎంతోమంది అమాయకులు బలైపోయారని అన్నారు. ఈ పరిస్థితికి కారణమైన నరేంద్ర మోడీని నడిరోడ్డుపై కాల్చేయాలని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

జగన్ అక్రమాస్తుల కేసులో మోడీ పేరు బయటకు వచ్చింది.. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసుతో తాము భారీగా నష్టపోయామని, న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు పంపించింది.. ఇందూ టెక్ జోన్ లో మారిషస్ భారీ పెట్టుబడి పెట్టి చివరకు నష్ట పరిహారాన్ని ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది..
మోడీకి నోటీసులు పంపడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో మోడీపై కత్తి మహేష్ సెటైర్లు వేశారు. “ములిగేనక్క మీద తాటికాయ పడటం అంటే ఇదే! అసలే మోడీ ప్రభుత్వం చేసిన మోసం గురించి ఆగ్రహంతో ఉన్న తెలుగు ప్రజల మధ్య, వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసుకి సంభందించి మోడీ కి మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టు నోటీసులు జారీ చేసింది” అంటూ ట్వీట్ చేశాడు..
ఈ నేప‌థ్యంలో అనంత‌పురంలో జ‌రిగిన రాజ్యంగ ప‌రిర‌క్ష‌ణ స‌భ‌కు ముఖ్య అతిధిగా క‌త్తి హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో ప‌లుఅంశాల‌పై మాట్లాడిన క‌త్తి పీఎం మోడీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు. నోట్ల రద్దు సమయంలో.. 50రోజుల్లో ప్రజలందరికీ దాని ఫలాలు అందుతాయని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ నేటికి దేశానికి ఆ ఫలాలు అందకపోగా.. నోట్ల రద్దు వ్యవహారంతో ఎంతోమంది అమాయకులు బలైపోయారని అన్నారు.
ఈ పరిస్థితికి కారణమైన నరేంద్ర మోడీని నడిరోడ్డుపై కాల్చేయాలని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు

.మోసాలు, అబద్ధాలు, ద్రోహానికి చిరునామాగా మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇన్నాళ్లు మనల్ని రక్షిస్తూ వచ్చిన రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం రక్షించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను తుంగలో తొక్కేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో తక్షణ అరెస్టులను నిషేధిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై ఇటీవల కత్తి మహేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'అధికార పీఠాల్ని ఎక్కే సత్తా ఇంకా సంపాదించుకోలేదు. కానీ ప్రభుత్వాల్ని కూల్చే దమ్ము మాత్రం దళితులకు ఉంది. బీజేపీ దళిత వ్యతిరేక విధానాలు ఇంకా ఎంతో కాలం సాగవు. కోర్టులని కూడా తమ అజెండాలో నింపేసిన మనువాదం కుట్రలు చెల్లవు' అని ఇటీవలే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories