వాళ్లేనా ప‌వ‌న్ ఇల్లు క‌ట్టించేది

వాళ్లేనా ప‌వ‌న్ ఇల్లు క‌ట్టించేది
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న క‌ల్యాణ్ పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ మండిప‌డ్డారు. చేతిలో చిల్లిగ‌వ్వ‌కూడా లేదు. నా ఇంట్లో ప‌నిచేసేవారికి శాల‌రీలు ఇచ్చే స్థితిలో...

జ‌న‌సేన అధినేత ప‌వ‌న క‌ల్యాణ్ పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ మండిప‌డ్డారు. చేతిలో చిల్లిగ‌వ్వ‌కూడా లేదు. నా ఇంట్లో ప‌నిచేసేవారికి శాల‌రీలు ఇచ్చే స్థితిలో నేను లేని అని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ కోట్ల రూపాయ‌ల‌తో ఇల్లు ఎలా క‌డుతున్నారంటూ ప్ర‌శ్నించారు.
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గుంటూరులో సొంతింటి నిర్మాణానికి పూజలు నిర్వహించారు. కొత్తింటి నిర్మాణానికి హోమం నిర్వహించి భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్‌ కల్యాణ్‌ పూజలు నిర్వహించారు. మంగళగిరిలో తన తండ్రి కానిస్టేబుల్‌గా పని చేశారని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌ ఆయన పని చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటి స్థలాన్ని అభిమానులే చూపించారని తెలిపారు. సాహితి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఇంటిని నిర్మిస్తోందన్నారు. రెండు ఎకరాల స్థలంలో ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే అమరావతిలో ఇంటిని నిర్మిస్తున్నట్లు పవన్‌ తెలిపారు.
అయితే ఆ ఇంటి నిర్మాణం పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ ద్వ‌జ‌మెత్తారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో త‌ల‌దూర్చ‌న‌ని హామీ ఇచ్చిన క‌త్తి...తాజాగా ఆ హామీకి తిలోదకాలిచ్చి బీజేపీ - టీడీపీ నేత‌ల స‌హ‌కారంతోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తిలో ఇంటినిర్మాణం , జ‌న‌సేన పార్టీ ఆఫీసు నిర్మాణం చేప‌డ‌తున్నార‌ని ఆరోపించారు. అంతేకాదు చంద్ర‌బాబు క‌న్నా ప‌వ‌న్ ఈవెంట్ మేనేజ్ మెంట్ తెలిసిన‌వాడిలా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తిలో ఇంటి నిర్మాణం కోసం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమాన ప్రయాణం భేష్. ఎక్కడ ఉన్నామనేది కాదు, ఏం చేస్తున్నామనేది ముఖ్యమని, కానీ దాన్ని మరిపించాలంటే మాయ చెయ్యక తప్పదని అన్నారు. అవును... ఇంతకీ... ప్రత్యేక విమానం ఖర్చులు ఎవరివబ్బా అని ప్రశ్నించారు.
ఈ సంద‌ర్భంగా టీడీపీ - బీజేపీ , రాయ‌ల‌సీమ నేత‌లపై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు క‌త్తి. వైజాగ్ రైల్వేజోన్ ఇవ్వ‌డం కుద‌ర‌క‌పోతే గుంత‌కల్ కు రైల్వేజోన్ ఇవ్వొచ్చు. కానీ చంద్ర‌బాబు మ‌న‌సొస్ప‌దు. రాయ‌ల‌సీమ‌ను అభివృద్ధి రాయ‌ల‌సీమ‌నేత‌ల‌కే పట్ట‌ద‌ని సూచించారు. మోసం చేసేవరకు మోడీ నటిస్తారని, ఆ తర్వాత పట్టించుకోరని విమ‌ర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories