తుప్పు ప‌ట్టిన‌ప్పుడే సాన‌బెట్టాలి క‌త్తి ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు

తుప్పు ప‌ట్టిన‌ప్పుడే సాన‌బెట్టాలి క‌త్తి ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు
x
Highlights

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ న‌వ్వుల పాల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ మ‌ధ్య జ‌రిగిన వివాదం మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. అంత‌కుముందు ఆ త‌రువాత అనేలా...

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ న‌వ్వుల పాల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ మ‌ధ్య జ‌రిగిన వివాదం మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. అంత‌కుముందు ఆ త‌రువాత అనేలా ...ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించ‌క ముందు క‌త్తిమ‌హేష్ అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించిన తరువాత ఆయ‌న్ని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య‌ పెరిగిపోయింది. ఏదైనా స‌మ‌స్య‌పై స్పందిస్తారా..?
అంటూ ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. అయితే వారికి అనుగుణంగా ఎప్పుడు ఎదో ఒక‌టి వివాదంపై కామెంట్ చేయ‌డం ఆయ‌న అభిమానులు శ‌భాష్ అనిపించుకోవ‌డం అంతా ష‌ర‌మామూలే. కానీ ఒక్కోసారి ఆయ‌న చేసిన కొన్ని ట్వీట్ల ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి .
ఇల్లుకాలి ఒక‌డు ఏడుస్తుంటే చుట్ట‌కాల్చుకోవ‌డానికి నిప్పుడు దొర‌క‌లేద‌ని ఏడ్చాడ‌ని సామెత చెప్పిన‌ట్లుగా
దేశంమొత్తం అతిలోక సుంద‌రి మ‌ర‌ణంపై చింతిస్తుంటే ...తాపీగా క‌త్తిమ‌హేష్ ఓ ట్వీట్ చేశారు. అంతే ట్వీట్ చూసిన అభిమానులు తిట్టిపోస్తున్నారు. స‌మ‌యం సంద‌ర్భంలేకుండా ఈ ట్వీట్లు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. శ్రీదేవి మ‌ర‌ణంపై చిరంజీవి ద్రిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.
సోష‌ల్ మీడియాలో ఎప్పడూ యాక్టీవ్ గా ఉండే క‌త్తి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశ‌రాఉ. శ్రీదేవి మరణంపై చిరంజీవి స్పందించారు. ముదావాహం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కూడా స్పందిస్తారని ఆశిస్తాను' అని కత్తి మహేష్ తన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
అంతే ఈ ట్వీట్లపై ప‌లువురు నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌రు స‌మ‌యం సంద‌ర్భం ఉండాల‌ని అంటుంటే..మ‌రొక‌రు తుప్పు ప‌ట్టిన‌ప్పుడే క‌త్తిని సాన‌బెట్టాలి ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదని సూచిస్తున్నారు. అన్నా నీ సలహా బాగుంది కానీ ఇప్పుడు కాదు అందరూ బాధలో ఉన్నారుస‌, అసందర్బవాఖ్యలు చేసే ఓ అర్ధమేధావీ! నీ తెలివితక్కువతనాన్ని చూసైనా నీట్వీట్లకు లైకులు కొట్టేవారు మారుతారని ఆశిస్తున్నా!'' అని పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories