మళ్లీ కాంగ్రెస్సే..బీజేపీకి షాక్..

మళ్లీ కాంగ్రెస్సే..బీజేపీకి షాక్..
x
Highlights

కర్ణాటక తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు ఆశలకు గండిపడనుందా? అంటే తాజాగా వెలుగులోకి...

కర్ణాటక తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గుప్పిట్లోనే ఉంటుందా? ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు ఆశలకు గండిపడనుందా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే అవుననే చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా తనకు సీట్లను కూడా పెంచుకోనుందట. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఆ సర్వే తెలిపింది. దక్షిణాది మినహా దేశంలో దాదాపుగా బీజేపీ పాగా వేసింది. అయితే దక్షిణాదిలో కూడా పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి ఈ సర్వేతో షాక్ తగిలింది. దక్షిణ భారతదేశంలో కేవలం కర్ణాటకలోనే బీజేపీకి ప్రాధాన్యం ఉంది. పైగా క్రీతం అక్కడ అధికారంలో ఉన్న చరిత్ర కూడా బీజేపీకి ఉంది. అందుకే దక్షిణాదిలోకి చొచ్చుకు రావడానికి కర్ణాటకను ప్రధాన ద్వారంగా భావించిన బీజేపీకి ఇది ఎదురు దెబ్బే అని చెప్పాలి.

2013 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఫోర్స్ అనే సంస్థ సర్వే ద్వారా వెల్లడించింది. ఈ తాజా సర్వే కూడా అదే సంస్థ చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణులకు గెలుపుపై విశ్వాసం బలపడింది. కాగా 2013 ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పడం విశేషం. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఓటర్ల శాతం కూడా కాంగ్రెస్‌కు అమాంతం పెరిగిపోనుందట. 46శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ విజయ దుంధుభి మోగించనుండగా 31 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉండనుందని సర్వేలో పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories