తెలంగాణకు కేంద్రం శుభవార్త.. కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్

తెలంగాణకు కేంద్రం శుభవార్త.. కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్
x
Highlights

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సంతోషకర వార్తను తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర సాంకేతిక...

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సంతోషకర వార్తను తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర సాంకేతిక సలహా మండలి పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చింది. దీంతో, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టైంది. బుధవారం సీడబ్ల్యూసీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పర్యావరణ, అటవీ అనుమతులతో పాటు అన్ని అనుమతులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories