బాలీవుడ్ హీరో 72ఏళ్ల వ‌య‌సులో నాలుగో పెళ్లి

బాలీవుడ్ హీరో 72ఏళ్ల వ‌య‌సులో నాలుగో పెళ్లి
x
Highlights

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ చాలా కామన్. ఐతే ఆ తేడా మహా అయితే 10 నుంచి 15 వరకూ...

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ చాలా కామన్. ఐతే ఆ తేడా మహా అయితే 10 నుంచి 15 వరకూ వుండేది.కానీ బాలీవుడ్ విలన్ పాత్రల్లో నటించే కబీర్ బేడీ మాత్రం తనకంటే 29 ఏళ్ల చిన్నదైన యువతిని పెళ్లాడి షాక్‌కు గురి చేశాడు. అది కూడా నాలుగో వివాహం. ఇతడికి ప్రస్తుతం 72 ఏళ్లు.

ఇతడి వివాహం పరంపరం చూస్తే... కబీర్ బేడీ మొదటిసారి ప్రతిమ అనే మహిళతో వివాహమైంది. వీరికి పూజాబేడీతో పాటు మరో కుమారుడు కలిగారు. ఆ తర్వాత ఆమెను వదిలేసి బ్రిటీష్ యువతి సుసాన్ హమఫ్రాజ్ ను పెళ్లాడాడు. వీరికి ఆడమ్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడోపెళ్లి టీవీ నిర్మాత నిక్కీ బేడీని వివాహం చేసుకున్నాడు.

ఐతే 2005లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు తన కంటే 29 ఏళ్ల చిన్నదైన మహిళను వివాహమాడాడు. విశేషమేమిటంటే... తనకు మొదటి భార్యతో కలిగిన సంతానం పూజాబేడీ వయసు 47 ఏళ్లయితే ఇప్పుడు కబీర్ బేడీ పెళ్లాడిన మహిళ వయసు 42 ఏళ్లు కావడం.

Show Full Article
Print Article
Next Story
More Stories