వారిపై ఏమి చర్యలు తీసుకున్నారు : జోగి రమేష్

వారిపై ఏమి చర్యలు తీసుకున్నారు : జోగి రమేష్
x
Highlights

ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై హత్యాయత్నం వ్యవహారంలో టీడీపీ సభ్యత్వ కార్డు నకిలీది తయారు చేశారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుపై గుంటూరు...

ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై హత్యాయత్నం వ్యవహారంలో టీడీపీ సభ్యత్వ కార్డు నకిలీది తయారు చేశారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత మాజీ ప్రభుత్వ విప్ జోగి రమేష్ ను విచారణకు పిలిచారు పోలీసులు. అడిషనల్‌ ఎస్పీ వైటీ నాయుడు, వెస్ట్‌ డీఎస్పీ సుమలత ల ఆధ్వర్యంలో నాలుగు గంటలకు పైగా జోగి రమేష్‌ను విచారించారు.

విచారణ అనంతరం మాట్లాడిన జోగి రమేష్.. వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి వేధించేలా టీడీపీ ప్రవర్తిస్తోందని అన్నారు.
ఇంతకుముందు జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని, సోమిరెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాన్ని తాము చెప్పామని.. అలా చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. కాగా జోగి రమేష్‌ కు మద్దతుగా గుంటూరు అరండల్ పేట పోలీస్‌స్టేషన్‌ వద్దకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories