జనసేన రణవ్యూహం... కదనరంగంపై పవన్‌ క్లారిటీ

జనసేన రణవ్యూహం... కదనరంగంపై పవన్‌ క్లారిటీ
x
Highlights

జనసేన రణవ్యూహం సిద్దమైంది. ఎన్నికల సమరానికి తొడగొట్టింది. ప్రజల్లోకి రావడంలేదంటూ, దూసుకువస్తున్న ప్రశ్నలకు సమాధానంగా, ఇక జనంలోనే ఉంటానంటూ జనసేనుడు...

జనసేన రణవ్యూహం సిద్దమైంది. ఎన్నికల సమరానికి తొడగొట్టింది. ప్రజల్లోకి రావడంలేదంటూ, దూసుకువస్తున్న ప్రశ్నలకు సమాధానంగా, ఇక జనంలోనే ఉంటానంటూ జనసేనుడు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. పార్టీ నిర్మాణమేదన్న విమర్శకు, ఇక బూత్‌లెవల్‌ నుంచే పోరాటం మొదలవుతుందని సంకేతమిచ్చాడు. ఎన్నికల మేనిఫెస్టోకు కొత్త రూపునిస్తున్నాడు. మీడియా, సోషల్ మీడియాలో వాడివేడిగా, ధాటిగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సిద్దం చేశాడు. ఇంతకీ జనసేనుడి రణవ్యూహం ఇంకా ఎలా ఉండబోతోంది.?

ప్రశ్నిస్తానన్న జనసేనపై కొన్నాళ్లుగా ప్రశ్నలు. అటు తిరిగి ఇటు తిరిగి ముసురుకున్న అనేక వివాదాలు. అసలు జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందా...లీడరే కానీ, క్యాడరేదన్న విమర్శలు...అసలు సిద్దాంతమేంటి....ప్రజల పట్ల ప్రణాళికలేంటన్న విసుర్లు....వీటన్నింటికీ సింగిల్‌ జవాబన్నట్టుగా జనసేనుడు క్లారిటీ ఇచ్చేశాడు...ఇక కదనరంగంలో తేల్చుకుందామని ప్రత్యర్థి పార్టీలకు సవాల్‌ విసిరాడు...ఇంతకీ పవన్ పయనమేంటి?

జనసేనుడు దూకుడు పెంచాడు. రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈనెల 15 నుంచి బస్సు యాత్ర మొదలెట్టబోతున్నట్టు ప్రకటించాడు. జనసేనాని జిల్లాల పర్యటన ఎలా ఉండబోతుంది..ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇదొక వేదికవుతుందా...2019 ఎన్నికలకు తొలిదశ ప్రచారంగా ఈ పర్యటన ఉండబోతుందా?

జనసేన అంటే పవన్ కల్యాణేనా...ఇంకెవరూ కనిపించరే...వాడవాడలా ఆ పార్టీ జెండాలేవి...నేటి వరకూ చాలామంది ప్రశ్నలివే. వీటికి సమాధానమే అన్నట్టుగా జనసేన అధినేత, తమ పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు రకరకాల ప్రణాళికలను పట్టాలెక్కిస్తున్నారు. రాజకీయ వ్యూహకర్తగా దేవ్ నేతృత్వంలో, ఇక సంస్థాగత ప్రణాళికలు పదునెక్కుతాయని చెప్పారు పవన్. జనసేన క్షేత్రస్థాయి నిర్మాణంపై పవన్‌ ఆలోచనలేంటి...ఆ ఆలోచనలకు దేవ్‌ ఎలాంటి కార్యరూపం ఇవ్వబోతున్నారు.... వైఎస్ జగన్, ఇప్పటికే నవరత్నాలూ అంటూ, పార్టీ మేనిఫెస్టోలో కీలకమైన అంశాలు ప్రజల ముందుంచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా, ఈ ఆగస్టులో మేనిఫెస్టోను ప్రకటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రత్యేక హోదా నుంచి రకరకాల ప్రజాసమస్యల వరకు, పార్టీ ప్రణాళికలో ఎలాంటి అంశాలు ఉండే అవకాశముంది?

అయితే అన్ని విషయాల్లో క్లారిటీ కనిపిస్తున్నా, పొత్తుల విషయంలోనూ మాత్రం కాస్త గుంభనంగానే ఉంది జనసేన. వామపక్షాలతో పోరాటం చేస్తామని చెప్పడంతో, ఇక 2019లో సీపీఐ, సీపీఎంలతో కలిసి రంగంలోకి దిగుతాడని చాలామంది భావించారు. కానీ ఏపీలోని మొత్తం 175 స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి, ప్రస్తుతానికైతే పొత్తుల ఆలోచనలేదని, కామ పెట్టేశారు పవన్. మరి ఎన్నికల నాటికి సీపీఎం, సీపీఐలతో సీట్ల సర్దుబాటు ఉంటుందా....లేక మరేదైనా భావసారూప్య పార్టీతో జతకలుస్తాడా....మున్ముందు వీటిపై కూడా క్లారిటీ వస్తుందంటున్నారు జనసేన కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories