జనసేన పార్టీ వ్యూహకర్తగా నియమతులైన దేవ్... ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2019లో అన్ని స్థానాలకు పోటీకి సై అన్న పవన్... తన పొలిటికల్...
జనసేన పార్టీ వ్యూహకర్తగా నియమతులైన దేవ్... ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2019లో అన్ని స్థానాలకు పోటీకి సై అన్న పవన్... తన పొలిటికల్ స్ట్రాటజీస్‌కు మరింత పదును పెట్టేందుకే దేవ్‌ను నియమించుకున్నాడంటున్నారు జనసైనికులు. మరి ఎవరీ దేవ్? రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ నేతల భేటీలో దేవ్ మాట్లాడుతూ... తాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేశానని, తనకు ఆ అనుభవం ఉందని చెప్పారు. నిన్న బీజేపీకి, నేడు జనసేన కోసం తెరపైకి ప్రస్తుతం జనసేనకు వ్యూహకర్తగా ఉన్న దేవ్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? అనే చర్చ అందరిలో నెలకొంది. ముఖ్యంగా జనసేన అభిమానుల్లో అది మరీ ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం జనసేనలో ఉన్న దేవ్ గతంలో బీజేపీకి పని చేశారని అంటున్నారు. ఇప్పుడు జనసేన కోసం తెరపైకి వచ్చారు. ఈయన హైదరాబాదులోని ఖైరతాబాద్ సమీపంలోని చింతల్‌బస్తీ వాసీగా చెబుతున్నారు. తనకున్న ఇంగ్లిష్ మీద పట్టుతో కేంద్రమంత్రులతో పరిచయాలు పెంచుకున్న దేవ్ గతంలో గతంలో బీజేపీకి పని చేయడమే కాకుండా పార్టీలో చేరారని, తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయలు స్వయంగా ఆయనకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారన్న టాక్ ఉంది.
2014కు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని చెబుతున్నారు. బీజేపీకి ఆయన పదేళ్ల పాటు పని చేశారు. ఇప్పుడు అదే దేవ్ జనసేన పార్టీ కోసం పని చేస్తున్నారని, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో నెలకొని ఉందని చెబుతున్నారు. దేవ్ డ్రెస్సింగ్ స్టయిల్, బాడీ లాంగ్వేజ్ అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ పరిచయం చేసినప్పుడు ఇంగ్లీషులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఆ ప్రసంగంలో తనకు తెలుగు అంతగా రాదన్న దేవ్... తన మాతృభాష అయిన తెలుగులో అనర్ఘళంగా మాట్లాడగలరు కూడా.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire