లోకేష్ అవినీతి..ప‌వ‌న్ చేతిలో ఆధారాలు

లోకేష్ అవినీతి..ప‌వ‌న్ చేతిలో ఆధారాలు
x
Highlights

జ‌న‌సేన‌ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ ఆవిర్భావ‌స‌భ‌లో టీడీపీ, అవినీతి ఎమ్మెల్యేలు,...

జ‌న‌సేన‌ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ ఆవిర్భావ‌స‌భ‌లో టీడీపీ, అవినీతి ఎమ్మెల్యేలు, నారాలోకేష్ అవినీతి గురించి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించిన విష‌యం తెలిసిందే.
త‌మిళ‌నాడు ఇసుక కాంట్రాక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి కేసులో లోకేష్ హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు. కాబ‌ట్టే సీఎం చంద్ర‌బాబు 29సార్లు ఢిల్లీ వెళ్లినా పీఎం మోడీ అపాయింట్మెంట్ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం త‌మ వ‌ద్ద ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు చేశారు. దానికి లోకేష్ కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ లోకేష్ అసెంబ్లీలో పవ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఘాటుగా స్పందించిన..అంత‌గా హెఫెక్ట్ చూపించ‌లేద‌ని పొలిటిక‌ల్ క్రిటిక్స్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.
ఆ వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ నేత‌లు ప‌వ‌న్ ను ఇరుకున పెట్టేలా విమ‌ర్శించారు. ద‌మ్ముంటే నారాలోకేస్ అవీనితి పై ఆధారాలు బ‌ట్ట‌బ‌య‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.
అమ‌రావ‌తిలో ఇంటినిర్మాణ కోసం ప‌వ‌న్ కొన్న భూముల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. కోట్ల‌లో ఉన్న భూముల్ని అతిత‌క్కువ ఖ‌రీదుతో ఎలా సొంతం చేసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. అయితే ఆయా ప్ర‌శ్న‌ల‌పై ఇన్నిరోజులు సైలెంట్ గాఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎట్టకేల‌కు స్పందించారు.
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం ఏపీలో జాతీయ ర‌హ‌దారుల్ని దిగ్భంద‌నం చేయనున్నారు. ఈనేప‌థ్యంలో జాతీయ రహదారుల దిగ్బంధానికి జనసేన మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ప్రకటనలో తెలిపింది.
ఈసంద‌ర్భాగా ప‌వ‌న్ కొన్నభూముల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను రైతుల వ‌ద్దే ఆ భూముల్ని కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో పాటు నారాలోకేష్ అవినీతిపై చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపింది. అంతేకాదు నారాలోకేష్ అవినీతిపై జాతీయ స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది.
అంతేకాదు రాష్ట్రం కోసం ఏపీకి చెందిన 25మంది ఎంపీలు ఒకే తాటిపైకి రావ‌డంలేద‌ని ప్ర‌శ్నించింది. వైసీపీ - టీడీపీ ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని, జ‌న‌సేన ఒక్క‌టే రాష్ట్రం కోసం చిత్త‌శుద్దితో పోరాటం చేస్తుంద‌ని అన్నారు. హోదా, చ‌ట్టంలోని చెప్పిన నిధుల‌న్నీ రాష్ట్రానికి ఇవ్వాల‌ని జ‌న‌సేన స్ప‌ష్టం చేసింది

Show Full Article
Print Article
Next Story
More Stories