కిలో జీడిపప్పు పదిరూపాయలే

Highlights

చూడటానికి కిడ్నీ షేప్ లో ఉండే జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. తినడానికే కాకుండా రకరకాల వంటల్లో జీడిపప్పును విరివిరిగా...

చూడటానికి కిడ్నీ షేప్ లో ఉండే జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. తినడానికే కాకుండా రకరకాల వంటల్లో జీడిపప్పును విరివిరిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి జీడిపప్పునుసామాన్యులు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తుంటారు. మామూలు జీడిపప్పు కేజీ 400నుంచి ఉంటుంది. అదే మేలైన జీడిపప్పు కావాలంటే వేలు ఖర్చుపెట్టాల్సిందే. కానీ అక్కడ మాత్రం జీడిపప్పును కిలో రూ.10రూపాయలకే అమ్ముతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.
జీడిపప్పు -
అనకార్డియేసి (Anacardiaceae) అనే మేలురకం పుష్పించే మొక్కల నుంచి వచ్చింది. దీనిలో ఇంచుమించుగా 82 రకాల పప్పులున్నాయి. అందులో ఒకటి ఈ జీడిపప్పు.
ప్రయోజనాలు
జీడిపప్పులో ఉండే "ఒలిక్ ఆసిడ్" గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడమే కాకుండా మానవ శరీరాన్ని పట్టి పీడించే కొన్ని రకాల వ్యాధులనుంచి సంరక్షిస్తుంది.
శరీరాన్ని బలంగా ఉంచుతుంది - జీడిపప్పులో ఉండే 300-750మిల్లీగ్రాముల మెగ్నీషియంతో ఎముకలు, కండరాలు మరియు నరాలు మరింత దృడంగా తయారవుతాయి. వీటితో పాటు అధిక రక్త పీడనం,
మైగ్రిన్ , తలనొప్పలనుంచి కాపాడుతుంది.
అధిక రక్తపోటు : బీపీ ఉన్నవారు జీడిపప్పు తినడానికి సంకోచిస్తుంటారు. అయితే జీడిపప్పులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తపోటు ఉన్నవారు
జీడిపప్పును తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ రాకుండా అరికడుతుంది : క్యాన్సర్ రాకుండా కట్టడి చేసే శక్తి జీడిపప్పుకు ఉన్నట్లు తెలుస్తోంది. జీడిపప్పులో సెలీనియం , విటమిన్ ఇ తో క్యాన్సర్ రిస్క్ ను అరికడుతాయి అంతేకాదు ఇందులో జింక్
అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలున్న జీడిపప్పు సాధారణంగా కేజీ రూ.400 నుంచి దొరికితే ఝార్ఖండ్‌లోని జమతారా జిల్లాలో మేలైన రకం జీడిపప్పు కేజీ రూ.10 కే దొరకుతుంది. ఆలూ, ఉల్లి కంటే ఇక్కడ అత్యంత చవకగా జీడిపప్పు దొరకడం విశేషం. జమతారా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన కృపాయనంద‌ ఝా అక్కడ జీడిపప్పు పంటను పండించేందుకు అనువైన ప్రాంతమని తెలుసుకున్నారు. అనుకున్నదే తడువుగా శాస్త్రవేత్తల సూచనలతో మొక్కలు నాటడం, భౌగోళిక పరిస్థితులపై అక్కడ స్థానికులకు అవగాహన కల్పించారు. అలా ప్రారంభమైన జీడిపప్పు సాగు నేటికి 40 ఎకరాల్లో పండుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories