‘జై సింహా’ సోష‌ల్ మీడియా రివ్యూ

‘జై సింహా’ సోష‌ల్ మీడియా రివ్యూ
x
Highlights

సంక్రాతి బ‌రిలో వ‌చ్చిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ తో ఇప్పుడు అంద‌రి చూపు బాల‌కృష్ణ 102వ చిత్రం జై సింహాపైనే ఉంది. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానున్న...

సంక్రాతి బ‌రిలో వ‌చ్చిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ తో ఇప్పుడు అంద‌రి చూపు బాల‌కృష్ణ 102వ చిత్రం జై సింహాపైనే ఉంది. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఓవ‌ర్సీస్ రీవ్యూ సోష‌ల్ మీడియ‌లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆ రివ్యూ చూస్తే మాత్రం బాల‌య్య అభిమానులు పండ‌గ‌చేసుకుంటార‌నే చెప్పుకోవ‌చ్చు. ముఖ్యంగా బాల‌య్య సినిమాలో మాట‌లు తూటాల్లా పేలాలి. అలా ఉంటేనే అభిమానులకు న‌చ్చేది. అందుకు త‌గ్గ‌ట్లే డైర‌క్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్ డిజైన్ చేసిన‌ట్లు టాక్ . ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతున్న రివ్యూలో
‘జై సింహా’ ఫస్టాఫ్ కామెడీ ఎంటర్టైనర్‌గా నడిచిందని.. సెకండాఫ్ వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని, ముఖ్యంగా బాలయ్య, నయనతార మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ పండినట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటి మాదిరే బాలయ్య భారీ డైలాగ్స్‌తో మాస్ ఆడియన్స్ థియేటర్స్ వైపు తీసుకురావడం ఖాయమే అంటున్నారు నెటిజ‌న్లు.
వీటితో పాటు మ‌రికొన్ని డైలాగులు తెగ హ‌డావిడి చేస్తున్నాయి. ‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి. ‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తాది’, ‘బెదిరింపులు నా బాడీకి పడవు, ఎవరిని ఉంచాలో.. ఎవరిని లేపాలో అక్కడ ఉంటాది లెక్క! మీవాడి నుదిటి మీద బతుకు గీత లేదు.. విధి రాత లేదు.. ఆయష్షు రేఖ లేదు. అక్కడ యుద్ధం చేసినా.. ఇక్కడ నీ పొగరు మారకపోతే బేవకూఫ్’ అంటూ బాలయ్య తనదైన శైలి డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడని ఇన్ సైడ్ టాక్.

Show Full Article
Print Article
Next Story
More Stories