జైసింహా ఫస్ట్ డే కలక్షన్

జైసింహా ఫస్ట్ డే కలక్షన్
x
Highlights

సంక్రాతి బ‌రిలో దిగిన పెద్ద‌సినిమాల్లో ముందంజ‌లో ఎవ‌రున్నారంటే జైసింహే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అజ్ఙాతవాసి, గ్యాంగ్ సినిమాలు ప్రేక్షకుల్ని...


సంక్రాతి బ‌రిలో దిగిన పెద్ద‌సినిమాల్లో ముందంజ‌లో ఎవ‌రున్నారంటే జైసింహే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అజ్ఙాతవాసి, గ్యాంగ్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకోలేకపోయాయి. ప‌వ‌న్ అజ్ఙాతవాసి రొటిన్ స్టోరీతో ఆడియ‌న్స్ సినిమాను మ‌రోసారి చూసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇక త‌మిళ‌వాస‌నతో గుబాళించి కొడుతున్న గ్యాంగ్ ను తెలుగు ప్రేక్ష‌కులు త‌ట్టుకోలేక‌పోయారు. కాబ‌ట్టే బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డ్డాయి. ఈ రెండు సినిమాల‌కు పోటాపోటీగా విడుద‌లైన బాల‌కృష్ణ జైసింహా సినిమా బాగుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో జైసింహాపై ప్రేక్ష‌కుల అంచ‌నాలు పెరిగి ట్రేడ్ క‌లెక్ష‌న్లు ఎంతొచ్చింది అనేదానిపై ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈనేప‌థ్యంలో గ‌త చిత్రాల‌కంటే జైసింహా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద‌ని క్రిటిక్స్ చెబుతున్నారు. బాలకృష్ణ కెరీర్ లో తొలి రోజు వసూళ్ల సాధనలో గౌతమి పుత్ర శాతకర్ణి.. పైసా వసూల్ తర్వాతి స్థానంలో జైసింహా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం. .ప్రపంచవ్యాప్త షేర్ కలెక్షన్స్ 8 కోట్లను దాటిన‌ట్లు టాక్. మొత్తానికి మిగిలిన సినిమాలు పోటీలేవుకాబ‌ట్టి సంక్రాతికి ఆ త‌రువాత కూడా జైసింహా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంద‌ని అంటున్నారు ప్రేక్ష‌కులు

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!

Show Full Article
Print Article
Next Story
More Stories