మార్క్ జూక‌ర్ బెర్గ్ కి కేంద్రమంత్రి హెచ్చ‌రిక‌లు

మార్క్ జూక‌ర్ బెర్గ్ కి కేంద్రమంత్రి హెచ్చ‌రిక‌లు
x
Highlights

ఫేస్ బుక్ డేటా గ‌ల్లంతుపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూక‌ర్ బెర్గ్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. డేటాను దొంగిలించి...

ఫేస్ బుక్ డేటా గ‌ల్లంతుపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూక‌ర్ బెర్గ్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. డేటాను దొంగిలించి ఎన్నిక‌ల్ని ప్ర‌భావితం చేయాలని చూస్తే ఊరుకునేది లేద‌ని అన్నారు. దేశంలో సుమారు 20 కోట్ల మంది భారతీయులు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని ఆయన చెప్పారు. ఐటీ చట్టం కింద మాకు కఠిన చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టం కింద భారత్‌కు రప్పించడానికి మీకు సమన్లు జారీ చేయడం సహా పలు చర్యల్ని తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍‌బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తలు వ‌చ్చాయి.
డాక్టర్‌ అలెగ్జాండర్‌ కోగన్‌ కేంబ్రిడ్జ్‌లో సైకాలజీలో ప్రొఫెసర్‌ మనుషుల మనస్తత్వం ఎలా మారుతోంది, ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులేంటి అనే అంశంపై ‘దిసీజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ అనే యాప్‌ రూపొందించాడు. దాన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేశారు. వ్యక్తిగత డేటాను పొందడానికి ఫేస్‌బుక్‌ రూల్స్‌ ఒప్పుకోవు. అయితే తన టార్గెట్‌ అంతా మనిషి సైకాలజీని డిజిటల్‌ కోణంలో నుంచి చూడడమేని ఆయన నమ్మబలికాడు. వేల మంది ప్రజలతో ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా ఇంటరాక్ట్‌ అవుతూ వారి డేటా సేకరించాడు.

ఇక క్రిస్టొఫర్‌ వైలీ ఈయన డేటా అనలిటిక్స్‌లో అఖండుడు. ఒకప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రచార సహాయకుడిగా తరువాత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన స్టీవ్‌ బానన్‌కు సన్నిహితుడు. సామాజిక మాధ్యమాల్ని విరివిగా వాడుకొని, వాటి ద్వారా ఓటర్లకు చేరువ కావొచ్చని, పెద్ద పెద్ద నెట్‌వర్కింగ్‌ సైట్లకు డబ్బు ఎరవేసి డేటాను తీసుకోవచ్చని వైలీ ఓ ప్రతిపాదన చేశాడు. బానన్‌ దానిపై ఆసక్తి చూపడంతో.. కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థను స్థాపించి- దాని ద్వారా ఆపరేషన్‌ కొనసాగించాలని భావించాడు. అయితే తప్పు చేస్తున్నానని పశ్చాత్తాపపడి ఆ పనిని పూర్తి చేయడానికి అంగీకరించలేదు. కానీ డేటా అనలిటిక్స్‌ సంస్థలోని మిగిలిన వారు మాత్రం అలెగ్జాండర్‌ కోగన్‌ను సంప్రదించి డేటాసేకరించి ట్రంప్‌ ప్రచార సమయంలో వాడుకున్నారు. విశేషమేమంటే ఈ డేటా లీక్‌ గురించి మొదట బయటపెట్టినది వైలీయే. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే మొత్తం డొంకంతా కదిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories