మరో మైలురాయి చేరిన ఇస్రో

మరో మైలురాయి చేరిన ఇస్రో
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్‌ ప్రయోగం.....

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్‌ ప్రయోగం.. విజ‍యవంతమైంది. ఈ తెల్లవారుజామున 4 గంటలా 4 నిముషాలకు ప్రయోగించిన రాకెట్.. 19 నిముషాల 19 సెకన్ల వ్యవధిలో IRNSS-1 ఐ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

దేశీయ దిక్సూచీ వ్యవస్థ కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్‌ ప్రయోగం.. విజ‍యవంతమైంది. 32 గంటల కౌంట్ డౌన్ తర్వాత షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల 4 నిముషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల తర్వాత IRNSS-1 ఐ ఉపగ్రహం.. నిర్దేశిత కక్ష‌్యలోకి ప్రవేశించింది. 19 నిముషాల 19 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇస్రో ఇప్పటివరకు 8 నావిగేషన్ శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించగా.. గతేడాది అక్టోబర్‌లో ప్రయోగించిన IRNSS-1 హెచ్ ఉపగ్రహం లక్ష్యాన్ని చేరకపోవడంతో.. ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఈ ఉపగ్రహం ద్వారా దేశీయ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం నింగి, నేల సముద్రంలో మార్గనిర్దేశం చేస్తుంది. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, మొబైల్‌ ఫోన్లతో అనుసంధానించడానికి, సమయాన్ని కచ్చితత్వంతో తెలియజేయడానికి, మ్యాపింగ్‌కు ఉపయోగపడుతుంది. తీరానికి దూరంగా రోజుల తరబడి సముద్రంలో చేపలవేట సాగించే మత్స్యకారులకు ఈ ఉపగ్రహం ద్వారా కీలక సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. యాప్ ద్వారా వాతావరణ హెచ్చరికలనూ ఇవ్వనుంది.

ఈ ఏడాది మరో తొమ్మిది ప్రయోగాలు చేయనున్నామని.. జీశాట్‌ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్‌ గయానా స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగిస్తామని.. ఇస్రో చైర్మన్‌ శివన్‌ చెప్పారు. అక్టోబర్‌లో చంద్రయాన్‌ - 2 ప్రయోగం ఉంటుందని వివరించారు. నావిక్‌ వ్యవస్థలోని ఉపగ్రహాల సంఖ్యను.. మొత్తం 11 కు పెంచాలని ఇస్రో భావిస్తోంది. ప్రాంతీయ స్థాయి సేవలకే పరిమితమైన ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories