మరో ప్రయోగానికి ఇస్రో రెడీ

మరో ప్రయోగానికి ఇస్రో రెడీ
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్...

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి సి41 ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.

జీశాట్‌6ఏ ఉపగ్రహం గల్లంతైన పది రోజుల తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీశాట్‌6ఏ వైఫల్యానికి సంబంధించిన ప్రభావం పడనీయకుండా పూర్తి శక్తియుక్తులతో పీఎస్‌ఎల్వీ-సీ41 రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున 4.04 గంటలకు ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేసుకుంటుంది. శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి దీనిని రోదసిలోకి పంపుతారని ఇస్రో తెలియజేసింది.

నావిగేషన్‌ ఉపగ్రహ శ్రేణిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఎనిమిదవ శాటిలైట్‌. బరువు 1425 కిలోలు. అయితే ఇక్కడ ఉత్కంఠకు దారితీస్తున్న మరో అంశం కూడా ఉంది. నావిగేషన్‌ ఉపగ్రహ శ్రేణికి చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ శాటిలైట్‌ను గత ఏడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించగా... ఉష్ణకవచం విడిపోక అది విఫలమైంది. ఆ ఘటన తర్వాత కక్ష్యలోకి పంపుతున్న నావిగేషన్‌ ఉపగ్రహం ఇదే. అదీ కాకుండా జీశాట్‌6ఏ గల్లంతై నియంత్రణలోకి రాలేదు. ఈ రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇస్రో శాస్త్రవేత్తలు ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ప్రయోగంలో 20వ సారీ ఎక్స్‌ఎల్‌ కాన్ఫిగరేషన్‌పైనే శాస్త్రవేత్తలు నమ్మకం ఉంచారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు 12న తెల్లవారుజామున 4.04 నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories