ఐపీఎల్ -11లో అరుదైన విజయాలు

ఐపీఎల్ -11లో అరుదైన విజయాలు
x
Highlights

ధూమ్ ధామ్ ఐపీఎల్..11వ సీజన్లో...మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ తనదైన స్టయిల్లో విజయాలు సాధించి... వారేవ్వా అనిపించుకొంటోంది. విజయాలు సాధించాలంటే...

ధూమ్ ధామ్ ఐపీఎల్..11వ సీజన్లో...మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ తనదైన స్టయిల్లో విజయాలు సాధించి... వారేవ్వా అనిపించుకొంటోంది. విజయాలు సాధించాలంటే భారీస్కోర్లు ఏమాత్రం అవసరం లేదని....చెప్పకనే చెబుతోంది. 2018 ఐపీఎల్ మొదటి 8 రౌండ్లలో....సన్ రైజర్స్ ఆరు విజయాలు, 2 పరాజయాల రికార్డుతో...లీగ్ టేబుల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తున్న... ఐపీఎల్ 11వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిఅంచె ఏడురౌండ్ల పోటీలు ఆసక్తికరంగా సాగిపోతున్నాయి. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తమదైన స్టయిల్లో విజయాలు సాధిస్తూ....ఎనిమిదిజట్ల లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి. ఓ వైపు....రెండువందలకు పైగా భారీ స్కోరింగ్ మ్యాచ్ ల చేజింగ్ లో ...చెన్నై సూపర్ కింగ్స్ కళ్లు చెదిరే విజయాలు సాధిస్తుంటే.... మరోవైపు....140కి మించని లోస్కోరింగ్ మ్యాచ్ ల్లో......హైదరాబాద్ సన్ రైజర్స్...థ్రిల్లింగ్ విజయాలతో వారేవ్వా అనిపించుకొంటోంది.

కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు...ప్రస్తుత సీజన్లో పోటీపడుతున్న జట్లలో....అత్యంత పదునైన బౌలింగ్ ఎటాక్ ఉన్న జట్టుగా గుర్తింపు తెచ్చుకొంది. పేస్ బౌలింగ్ విభాగంలో....డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, స్పిన్ విభాగంలో లెగ్ స్పిన్ జాదూ రషీద్ ఖాన్, లెఫ్టామ్ స్పిన్నర్ షకీబుల్ హసన్ లతో...హైదరాబాద్ బౌలింగ్ ఎటాక్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.

బ్యాటింగ్ విభాగంలోని లోపాలను బౌలింగ్ ఎటాక్....పూడ్చుతూ వస్తోంది. హోంగ్రౌండ్ రాజీవ్ గాంధీ స్టేడియం, ముంబై వాంఖెడీ స్టేడియాలు వేదికలుగా జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్ ల్లో ...హైదరాబాద్ సన్ రైజర్స్... 140...అంతకంటే తక్కువ స్కోర్లనే...కాపాడుకొని...విజేతగా నిలువగలిగింది. ఇక...ప్రస్తుత సీజన్లో వరుసగా ఐదు విజయాలతో దూకుడుమీదున్న కింగ్స్ పంజాబ్ జట్టుపైనా....సన్ రైజర్స్....లోస్కోరింగ్ థ్రిల్లర్లో సూపర్ విన్ సాధించగలిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 132 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది.

సమాధానంగా...133 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పవర్ ఫుల్ పంజాబ్ ను...119 పరుగులకే ఆలౌట్ చేసి...13 పరుగుల సంచలన విజయం తన ఖాతాలో వేసుకోగలిగింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లు, షకీబుల్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో ...ఇప్పటి వరకూ సన్ రైజర్స్ ఆడిన మొత్తం ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో....ఎక్కువ విజయాలు ...తక్కువ స్కోర్లతో సాధించినవే కావడం విశేషం. 130 పరుగుల లక్ష్యమైనా... హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ ఎటాక్ పైన....భారీలక్ష్యంగా మారిపోయింది. ఐపీఎల్ రెండో అంచె మిగిలిన ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో.....హైదరాబాద్ సన్ రైజర్స్ మరో మూడు విజయాలు సాధిస్తే...ప్లేఆఫ్ రౌండ్ కు చేరుకోగలుగుతుంది. అయితే....వచ్చే ఏడురౌండ్లలో... మరెన్ని లోస్కోరింగ్ థ్రిల్లింగ్ విన్స్ ఉంటాయన్నదే ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories