ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ లో భారత్ భళా

Highlights

ప్రపంచ హాకీ పురుషుల, మహిళల ర్యాంకింగ్స్ లో భారతజట్లు పుంజుకొన్నాయి. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ హాకీ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో విజేతలుగా నిలిచిన...

ప్రపంచ హాకీ పురుషుల, మహిళల ర్యాంకింగ్స్ లో భారతజట్లు పుంజుకొన్నాయి. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ హాకీ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో విజేతలుగా నిలిచిన భారతజట్లు ఆసియాహాకీలో సూపర్ పవర్ జట్లుగా గుర్తింపు పొందాయి. అయితే అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల విభాగంలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల విభాగంలో మాత్రం భారత్ తొలిసారిగా టాప్-10లో చోటు సంపాదించింది. జపాన్ వేదికగా ముగిసిన 2017 మహిళల ఆసియాకప్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా భారత్ టాప్ టెన్ లో నిలువగలిగింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్, అర్జెంటీనాజట్లు ప్రపంచ మొదటి మూడుర్యాంకుల్లో నిలిచాయి. భారత్ 10వ ర్యాంకుకు చేరింది. ఆస్ట్రేలియా నాలుగు, న్యూజిలాండ్ ఐదు, జర్మనీ ఆరు, అమెరికా ఏడు ర్యాంకులు సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories