షాన్‌దార్‌ పృథ్వీ.. ఈ సెంచరీ నాన్నకే అంకితం

షాన్‌దార్‌ పృథ్వీ.. ఈ సెంచరీ నాన్నకే అంకితం
x
Highlights

వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషా వెస్టీండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అరంగేట్రం చేసిన తొలి...

వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషా వెస్టీండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ(134) చేసిన అతడిపై స్వరత్రా ప్రశసంల జల్లు కురుస్తోంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో భారతజట్టులోకి వచ్చిన పృథ్వీ.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఒంటిచేత్తో భారత్ కు వరల్డ్ కప్ ను సాధించిపెట్టాడు. మిస్టర్ వాల్.. రాహుల్ ద్రావిడ్ సారధ్యంలో రాటుదేలిన పృథ్వీ షా.. టీమిండియా తరుపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించి బౌలర్లకు సమాధానంగా నిలిచాడు. కాగా తన క్రీడా మలుపునకు కారణం ఒంగోలులోని శర్మా క్రికెట్ మైదానం అని గతంలోనే చెప్పిన పృథ్వీ.. నిన్న(గురువారం) సెంచరీ అనంతరం తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.. మొదట్లో కొద్దిగా ఒత్తిడికి లోనయ్యానని.. కుదురుకున్నాక నిదానంగా ఆడాను. బౌలర్లపై ఆధిపత్యం చలాయించాను అని అన్నాడు. అనుకూలంగా వచ్చిన బంతులను మాత్రమే భారీ షాట్స్ ఆడటానికి ప్రయత్నించానని తెలిపాడు. ఇక తన తొలి సెంచరీని తన తండ్రికి అంకితమిచ్చాడు పృథ్వీ. ‘సెంచరీ చేశాక నాన్న గురించే ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాన్న నా కోసం చాలా త్యాగాలు చేశాడు. ఈ సెంచరీ నాన్నకు అంకితం’ అని పృథ్వీ షా తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories