భార‌త్ లో విస్త‌రించ‌నున్న ట్రంప్ వ్యాపారాలు

భార‌త్ లో విస్త‌రించ‌నున్న ట్రంప్ వ్యాపారాలు
x
Highlights

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న వ్యాపారాల్ని భార‌త్ లో విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ట్రంప్ పెద్ద కుమారుడు జూనియ‌ర్ ట్రంప్...

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న వ్యాపారాల్ని భార‌త్ లో విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ట్రంప్ పెద్ద కుమారుడు జూనియ‌ర్ ట్రంప్ ఢిల్లీకి స‌మీపంలో విలాసవంత‌మైన ట్రంప్ ట‌వ‌ర్ను నిర్మిస్త‌న్నారు. 47అంత‌స్తుల ట‌వ‌ర్ లో మొత్తం 250 ఇళ్లు ఉండ‌గా ..దీన్ని 2023కి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ట‌వ‌ర్ను స్థానిక డెవ‌ల‌ప‌ర్ల‌తో ఒప్పొందాలు కుదుర్చుకొని అడ్వాన్స్ బుకింగ్ ల‌ను మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన ఈ ప్లాట్ కొనుగోలు చేయ‌డానికి డౌన్ పేమెంట్ కింద రూ.2.5కోట్లు చెల్లించాల్సి ఉండ‌గా వీటి ధ‌ర రూ 5.5కోట్ల నుంచి రూ.11కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని టవ‌ర్స్ నిర్మాణ ప్ర‌తినిధులు తెలిపారు. ఇప్పటి వరకు 75 మంది బుక్ చేసుకున్నారని గురువారం వరకు డెడ్ లైన్ ఉందని అప్పటి వరకు ఆ సంఖ్య 100కు చేరుతుందని ట్రిబికా సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
కాగా అమెరికా తర్వాత ట్రంప్ కు భారీ ప్రాజెక్టులు చేప‌ట్ట‌నున్న‌ది భారత్ లోనే. జూనియర్ ట్రంప్ తన పర్యటనలో దేశంలోని నాలుగు నగరాలు ముంబయి - పుణె - గురుగ్రామ్ - కోల్ కతాను సందర్శించనున్నట్లు తెలిసింది. స్థానిక డెవలపర్లకు తమ బ్రాండ్ ట్రంప్ ను వాడుకునేందుకు ట్రంప్ ఆర్గనైజేషన్ అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా వచ్చిన లాభాల్లో కొంత వాటా కూడా తీసుకోనుంది. మీడియా రిపోర్టుల ప్రకారం అన్ని ప్రాజెక్టులు పూర్తికావడానికి దాదాపు 1.5 బిలియన్ అమెరికా డాలర్లను ఖర్చు చేయనున్నారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం భారత్ లో 2016లో వేసిన వెంచర్ల ద్వారా రాయాల్టిల కింద ట్రంప్ కుటుంబానికి దాదాపు 3మిలియన్ అమెరికా డాలర్లు వచ్చినట్లు తన కథనంలో పేర్కొంది. తన తండ్రి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రస్తుతం ట్రంప్ కంపెనీలను డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చూసుకుంటున్నాడు. కాగా ఢిల్లీలో ఆయనది అనధికార పర్యటనేనని అమెరికా దౌత్యకార్యాలయం కూడా స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories