కేంద్రంతో ఢీ.. చంద్రబాబు సంచలన ప్రతిపాదన

కేంద్రంతో ఢీ.. చంద్రబాబు సంచలన ప్రతిపాదన
x
Highlights

ప్రత్యేక హోదాను కేంద్రం ఇచ్చేది లేదని అర్థమైన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తాడో పేడో తేల్చుకునే దిశగానే.. ఆయన...

ప్రత్యేక హోదాను కేంద్రం ఇచ్చేది లేదని అర్థమైన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తాడో పేడో తేల్చుకునే దిశగానే.. ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. రాష్ట్రంలో పరిపాలన ఆగుతుందన్న భయమే అవసరం లేదని.. తాను ఉన్నంత వరకూ.. సుపరిపాలన ఆగదని.. అభివృద్ధి ఆగదని జనానికి బాబు భరోసా వెనక.. కేంద్రంపై పెరిగిన అసహనమే ఎక్కువగా కనిపిస్తోంది.

అక్కడితో ఆగని చంద్రబాబు.. అభివృద్ధికి మాత్రమే కాదు.. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. నిధుల సమీకరణకు తమ మార్గాలు తమకు ఉన్నాయని స్పష్టీకరించడం సంచలనమవుతోంది. జనాల నుంచే డబ్బులు సేకరించి.. బాండ్ల రూపంలో నిధులు కూడబెట్టి.. వాటికి బ్యాంకుల కంటే కనీసం రెండు మూడు శాతం డబ్బులు ఎక్కువగా వడ్డీ ఇచ్చి.. రాజధాని నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పడం ఆయన తెగింపును సూచిస్తోంది.

అంతా బానే ఉంది కానీ.. రాజధాని నిర్మాణం పేరిట.. ఆ మధ్య బాగానే వసూళ్లు జరిగాయి. ఇటుక నుంచి మొదలు పెట్టి.. కోట్ల మొత్తంలో డబ్బులు విరాళాలుగా అందాయి. ఇప్పటివరకైతే.. ఆ డబ్బులకు లెక్క చెప్పినవారు లేరు. ఇప్పుడు బాండ్లు సేకరించి.. రాజధాని కడతామని అంటే ఎలా నమ్మాలి అని చంద్రబాబు తీరును ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. పూర్తి స్పష్టత ఇచ్చి.. బాండ్లను సేకరిస్తే.. ప్రజల సొమ్ము నిరుపయోగం కాకుండా ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories