అమ్మా నీ త‌లెత్తుకునేలా చేస్తా

అమ్మా నీ త‌లెత్తుకునేలా చేస్తా
x
Highlights

తొలిసారి త‌న త‌ల్లి శ్రీదేవి మ‌ర‌ణంపై పెద్ద కూతురు జాన్వీక‌పూర్ స్పందించింది. భావోద్వేగంతో కూడిన ఓ లేఖ‌రాసిన జాన్వీ అమ్మానిన్ను త‌లెత్తుకునేలా...

తొలిసారి త‌న త‌ల్లి శ్రీదేవి మ‌ర‌ణంపై పెద్ద కూతురు జాన్వీక‌పూర్ స్పందించింది. భావోద్వేగంతో కూడిన ఓ లేఖ‌రాసిన జాన్వీ అమ్మానిన్ను త‌లెత్తుకునేలా చేస్తానంటూ పేర్కొంది. ఇప్పుడా లేఖ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.
ప్రేక్ష‌క లోకాన్ని విషాదంలో నీ నటి శ్రీదేవి దుర్మరణం భారతీయ ప్రేక్షకలోకాన్ని విషాదంలో నింపింది. ఆమె మరణ వార్త ప్రత్యేకించి దక్షిణాది వారిని దిగ్బ్రాంతికి గురి చేసింది. కేవలం 54 ఏళ్ల వయస్సులోనే ఆమె హఠాన్మరణం చెందడాన్ని ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు శ్రీదేవి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయారు.. ఇప్పుడీ ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. కేవలం 54 ఏళ్లకే ఆమె గుండెపోటుకు గురికావడం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అందులోనూ ఆమె దేశం కాని దేశంలో కన్నుమూయడం కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలోనూ శ్రీదేవి ఎన్నడూ తీవ్ర అనారోగ్యానికి గురైన దాఖలాలు లేవు. ఆమె ఐదుపదుల వయస్సులోనూ ఆమె ఫిట్ నెస్ బాగా మెయింటైన్ చేశారు. సినీరంగంలో రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఆమెతో సినిమాలు చేసేందుకు ఇంకా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీదేవి మరణవార్త అందర్నీ కలచివేసింది.
అయితే జాన్వీని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసి..త‌న ప్లేస్ ను రీప్లేస్ చేసేలా చూడాల‌నుకున్న శ్రీదేవి ద‌డ‌క్ సినిమా కోసం ఎంత‌గానో ఎదురు చూసింది. జాన్వీ ని ఆద‌రిస్తారో లేదో అన్న ఒత్తిడి లో కూడా జాన్వీ చేస్తున్న ద‌డ‌క్ సినిమా ను చూడాలి ఆశ‌గా ఎదురు చూసింది. కానీ అనుకోకుండా దుబాయ్ పెళ్లికి వెళ్లిన శ్రీదేవి బాత్రూం హోట‌ల్లో క‌న్నుమూశారు.
ఆమె మ‌ర‌ణం త‌రువాత జాన్వీ త‌న త‌ల్లికి ప్రేమ‌తో ఓ లేఖ రాసింది. అమ్మా.. నువ్వు గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను అంటూ పేర్కొంది.
ప్రతి ఒక్కరూ తన తల్లికి ఆత్మ శాంతికలగాలని కోరుకోవాలని జాన్వీ విజ్ఞప్తి చేసింది. తన తండ్రి, తల్లి ఎంత ప్రేమగా ఉండేవారో తనకు బాగా తెలుసని చెప్పింది. 'నేను, ఖుషీ తల్లిని మాత్రమే కోల్పోయాం.. కానీ, మా నాన్న ఆయన మొత్తం జీవితాన్ని కోల్పోయారు. మా నాన్నకు ఆమె నటిగా, తల్లిగా, భార్యగా కంటే చాలా ఎక్కువ. అది ఎంతో నేను చెప్పలేను' అంటూ కూడా జాన్వీ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories