నేను ఏపీకి వెళ్ల‌ను..?

నేను ఏపీకి వెళ్ల‌ను..?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తోసిపుచ్చారు. ఏపీకి సంబంధించి...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తోసిపుచ్చారు.
ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే యోచనలో ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని ఏపీకి పంపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. . తెలంగాణ గవర్నర్ గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరు కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది.
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండాల్సివస్తుంది. దీంతో ఏపీకి ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ ను కేటాయించాల‌ని ప‌లువురు నేత‌లు కేంద్రంతో మంత‌నాలు జ‌రిపారు. గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి నిలపలేకపోతున్నారని, అందువల్ల ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు కేంద్రానికి ఇటీవల లేఖ రాశారు. అటు-ఏపీకి నూతన గవర్నర్ గా కిరణ్ బేడీని నియమించవచ్చునని గతంలో కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేప‌థ్యంలో తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తల‌పై కిర‌ణ్ బేడీ స్పందించారు. త‌న‌ని పుదుచ్చేరి నుంచి ఏపీకి కేటాయిస్తున్నార‌నే వార్త‌ల్ని ఖండించారు. తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్‌ బేడీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories