న‌గరంలో త‌గ్గిన ఆర్డిన‌రీ బ‌స్ ఛార్జీలు

న‌గరంలో త‌గ్గిన ఆర్డిన‌రీ బ‌స్ ఛార్జీలు
x
Highlights

న‌గ‌రంలో ఉన్న ఆర్టీసీ బ‌స్సుల్లో చిల్ల‌ర క‌ష్టాలు అన్నీ ఇన్నీకావు. అయితే ఆ చిల్లర క‌ష్టాల నుంచి , అధిక ఛార్జీల నుంచి ప్ర‌యాణికులు ఉప‌శ‌మ‌నం పొందేలా...

న‌గ‌రంలో ఉన్న ఆర్టీసీ బ‌స్సుల్లో చిల్ల‌ర క‌ష్టాలు అన్నీ ఇన్నీకావు. అయితే ఆ చిల్లర క‌ష్టాల నుంచి , అధిక ఛార్జీల నుంచి ప్ర‌యాణికులు ఉప‌శ‌మ‌నం పొందేలా టీఎస్ ఆర్టీసీ చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టీనరీ బస్సుల్లో రూ.7గా ఉన్న కనిష్ఠ ధర 5కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌‌లో రూ.8 చార్జిని 10కి పెంచుతున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ రమణరావు తెలిపారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో 20 స్టాపులు 40 కిలోమీటర్ల పరిధిలో రూ.28 చార్జీని 30 పెంచింది.
ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ లో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో చిల్ల‌ర‌క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేలా సిటీ బ‌స్ చార్జీల హేతు బ‌ద్ధీక‌ర‌ణ చేశారు. దీంతో చిల్ల‌ర క‌ష్టాల నుంచి ప్ర‌యాణికులు , ఆర్టీసీ అధికారులు ఉప‌శ‌మ‌నం పొందారు. దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సిటిజన్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీకి లేఖ రాసింది. దీంతో న‌గ‌ర బ‌స్సుల్లో ప్రయాణ ఛార్జీలు త‌గ్గించిన టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం .. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో టికెట్‌ చార్జీలు రూ.5కు సవరించటం జరుగుతుందన్నారు. మారిన బస్‌చార్జీలను సోమవారం అమలు చేస్తునట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories