నటసార్వభౌముడి కోసం హాలీవుడ్

నటసార్వభౌముడి కోసం హాలీవుడ్
x
Highlights

ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ టెక్నీషియ‌న్ లు సినిమాకు సంబంధించి డ్రాయింగ్ వ‌ర్క్, తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి...

ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ టెక్నీషియ‌న్ లు సినిమాకు సంబంధించి డ్రాయింగ్ వ‌ర్క్, తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి ఎన్టీఆర్ స్నేహితుల్ని , ద‌గ్గ‌ర బంధువుల్ని , క్లాస్ మెట్స్ తో భేటీ కానున్నారు. అనంత‌రం ఈ భేటీలో ఎన్టీఆర్ గురించి త‌గిన డేటా సేక‌రించి ..ఆ డేటాను సినిమాకోసం వినియోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక బాల‌కృష్ణ హీరోగా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో యాక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కు తేజ డైర‌క్ట‌ర్ గా, సాయి కొర్రుపాటి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎన్టీఆర్ లో 70 గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్నానంటూ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ షాకిచ్చారు. ద‌శావ‌తారం సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్ ప‌ది అవ‌తార‌ల్లో అల‌రించారు. గ‌త రెండు సంవ్స‌రాల నుంచి బాల‌కృష్ణ డైర‌క్ట‌ర్ తేజ ఎన్టీఆర్ బ‌యోపిక్ లో క‌స‌ర‌త్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు ఎన్టీఆర్ లో యాభై ఏళ్ళ వెనక‌టి కాలాన్ని ప్రతిబింబించేలా బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో న‌టించేందుకు ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్ల‌ను సెల‌క్ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారు రేపోమాపో ఫైన‌లైజ్ అవుతున్న‌ట్లు స‌మాచారం.
బాల‌కృష్ణ తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని అనేక కోణాల్లో తెర‌కెక్కించేందుకు బాల‌కృష్ణ కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ మిత్రులు, శ‌త్రువులు సైతం ఈ బ‌యోపిక్ లో ప్ర‌త్య‌క్ష‌మవుతార‌ని వెల్ల‌డించారు. ఇక ఎన్టీఆర్ గురించి అన్నీంటిని సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పిన‌ బాల‌య్య‌.. నేను 70 గెటప్పుల్లో కనిపించబోతున్నా. అవేంటన్నది ఇప్పుడే చెప్పను. బాలయ్యగా నా పాత్ర కూడా ఇందులో ఉంటుంది. కానీ నేనుండేది ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే’’ అని బాలయ్య అన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories