అనుష్కతో డేటింగ్ లో లేను.. కావాలంటే రాజమౌళిని అడగండి

అనుష్కతో డేటింగ్ లో లేను.. కావాలంటే రాజమౌళిని అడగండి
x
Highlights

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జోడిలపై పుకార్లు చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే, కాగా ఇటివల విడుదలైన బహుబలి తరువాత వీరిద్దరూ...

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జోడిలపై పుకార్లు చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే, కాగా ఇటివల విడుదలైన బహుబలి తరువాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఈ ప్రేమ కాస్తా పెళ్లి పీఠలదకా వెళ్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తాలపై ప్రభాస్, అనుష్క ఖండించినా పుకార్లకు మాత్రం కళ్లేం వేయలేకపోతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్వహిస్తున్న షో "కాఫీ విత్ కరణ్" ఈ కార్యక్రమంలో బహుబలి టీం పాల్గోన్నారు. అయితే కరణ్ సరదాగానే మాట్లాడుతూ అనుష్క, ప్రభాస్ వ్యవహారం తీసాడు కరణ్. అనుష్కతో డేటింగ్ చేస్తున్నారంటూ లోకం కోడై కూస్తుంది కదా! దినిపై మీ స్పందన ఏంటి అని ప్రభాస్ ని అడిగాడు కరణ్. దినికి ప్రభాస్ స్పందిస్తూ ఏ హీరో హీరోయిన్లు కలిసి ఉంటే చాలు ఈ లోకంలో వారిద్దరికి లేనిపోని లింక్ పెట్టి ప్రచారం చేస్తారు అని అన్నారు. అయితే నిజానికి అనుష్కకు నాకు మధ్య అలాంటిదేం లేదని అన్నారు. తమపై వస్తున్న వార్తాలను కొట్టిపరేసారు ప్రభాస్. డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తాల్లో ఏమాత్రం నిజం లేదని కావాలంటే రాజమౌళి గారిని అడగండి అన్నాడు ప్రభాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories