తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షం

తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వర్షం
x
Highlights

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచేయగా... మూడు గంటల తర్వాత మేఘాలు కమ్ముకొచ్చాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో...

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచేయగా... మూడు గంటల తర్వాత మేఘాలు కమ్ముకొచ్చాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. మెదక్‌ జిల్లాలోని అందోల్‌ మండలం జోగిపేట, వట్‌పల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో వర్షం కురవడంతో విక్రయ కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుమ్మడిదల మండలంలోని వివిధ గ్రామాల్లోనూ భారీ వర్షం పడుతోంది.

మరోవైపు సిద్ధిపేటలోని నారాయణ రావు పేట్‌, చిన్న కోడూరు మండలంలోని గోనెపల్లితో పాటు వివిధ గ్రామాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్‌లోని పరిగి, కోడూరులో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతోంది. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories