పిల్ల‌ల నిద్ర‌విష‌యంలో త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

పిల్ల‌ల నిద్ర‌విష‌యంలో త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
x
Highlights

చిన్న‌పిల్ల‌ల్ని బుజ్జ‌గించేందుకు త‌ల్లిదండ్రులు అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. ర‌క‌ర‌కాల మాట‌లు చెప్పి బుజ్జ‌గించినా రాను రాను అదే అల‌వాటుగా మారితే...

చిన్న‌పిల్ల‌ల్ని బుజ్జ‌గించేందుకు త‌ల్లిదండ్రులు అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. ర‌క‌ర‌కాల మాట‌లు చెప్పి బుజ్జ‌గించినా రాను రాను అదే అల‌వాటుగా మారితే ప్ర‌మాద‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. బ‌జ్జ‌గించ‌డం బాగానే ఉన్నా అదే అంశాన్ని డాక్ట‌ర్లు న‌స అని అంటున్నారు. న‌స‌ని రెండు ర‌కాలుగా విభ‌జిస్తున్నారు. అందులో మొదటి కారణం పెంపకంలో లోపం కాగా రెండవ కారణం పిల్లలకు నిద్ర చాలక పోవటం.
పిల్ల‌ల్ని భ‌విష్య‌త్తు కోసం పిల్ల‌ల పెంప‌కంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. మ‌రి పిల్ల‌లు నిద్ర విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించ కూడ‌ద‌ని ప‌లు స‌ల‌హాఇస్తున్నారు. మ‌రి పిల్ల‌లో ఏ వ‌య‌సులో ఎంత‌సేపు నిద్ర‌పోవాలి అనే విష‌యం తెలుసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
చిన్న పిల్లలు అంటే 4-5 ఏళ్ళ వయసు పిల్లలు – 11 గంటల 30 నిమిషాలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు అంటే 5-8 ఏళ్ళ వయసు పిల్లలు – 11 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
చిన్న పిల్లలు అంటే 8-10 ఏళ్ళ వయసు పిల్లలు – 10 గంటలు నిద్రను పోవాల్సి ఉంటుంది.
పిల్లల ఎదుగుదలను తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగిన పిల్లల్లో ఎదుగుదల సమస్య లతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కన పడుతుంది. అయితే తేడా చంటి పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. పెద్ద పిల్లల్లో మరో రకంగా ఉంటుంది. చంటి పిల్లలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు అదే పెద్ద పిల్లలు నస పెడుతుంటారు.ఎ. కొన్ని పద్ధతులను పాటించటం వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడ వచ్చు.
1.వయస్సుకు తగ్గట్టు పిల్లల్ని నిద్ర పోయేటట్టు అలవాటు చేయాలి
2.సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి.
3.సెలవుల్లో పిల్లలు నిద్ర వేళలు క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, బడి తెరవటానికి కనీసం వారం రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.
4. పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్ర వేళకు అర గంట ముందు వాటిని చూడనీయకూడదు. అరగంట ముందు చదవటం, హోం వర్కు చేయటం నిలిపేయాలి.
5.సాయంత్రాలలో, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగర్తలు పాటించాలి. సాయం కాలం తరువాత చాకోలేట్లు కోలా డ్రింకులు తాగనీయ వద్దు. వీటిలో ఉండే కీఫిన్ రోజువారీ నిద్రను చెడ గొడుతుంది.
6.పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలు నేర్పించాలి. ‘బెడ్ రొటీన్స్’ అలవాటు చేయాలి


Show Full Article
Print Article
Next Story
More Stories