మంచినీళ్లు ఎక్కువగా తాగినా ప్రమాదమే..తక్కువగా తాగినా ప్రమాదమే

Highlights

మన శరీరం పనితీరు సక్రమంగా ఉండాలంటే నీరు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్‌ను చేరవేయడం.. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు...

మన శరీరం పనితీరు సక్రమంగా ఉండాలంటే నీరు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్‌ను చేరవేయడం.. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు వెళ్లగొట్టడం వరకు రకరకాల పనులు చేస్తుంది .అయితే నీటిని అధికంగా తాగితే కోమాలోకి వెళతారని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. సాదారణంగా ప్రతీరోజు మనం నీరు ఎంత తాగితే అంత మంచిదని పెద్దవారు చెబుతుంటారు. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుటుందని, హెల్దీగా ఉండొచ్చని అంటుంటారు.
మరి మంచినీళ్లు సరిగా తాగకపోతే నోరు, గొంతుకే కాదు.. కళ్లకు కూడా ఎఫెక్టే. మీరు తక్కువగా నీళ్లు తాగుతున్నారని మీ కళ్లే చెబుతాయి. కళ్లు పొడిబారడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు నీళ్లు సరిగా తాగలేదని సూచిస్తాయి. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉంటే కళ్లీటి నాళాలు కూడా పొడిగా మారతాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది కాదు.
నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే తాగడం వల్ల 'హైపోనెట్రేమియా' సమస్య ఉత్పన్నమై రక్తంలో సోడియం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో వాతులు, వికారం, కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. మనశరీరాననికి కావాల్సనప్పుడే తాగాలి. ఆరోగ్యాన్ని నీరు మంచిదని తాగితే ప్రమాదమేనని ఆయూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్‌ ఫారెల్ తెలిపారు. ఇందుకోసం కొంతమందిని తీసుకున్న ఈ బృందం వారిలో సగం మందిని సరిగ్గా దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలని చెప్పి, మిగిలిన సగం మందిని మాత్రం ఎక్కువ నీళ్లు తాగమని చెప్పారు. అలా సరిపడ నీళ్లు తాగినవారు బాగున్నారు. నీళ్లు ఎక్కువగా తాగినవాళ్లు వాంతులు, వికారం తో కోమాలోకి వెళ్లిపోయారు. అలా మంచినీళ్లు ఎక్కువగా తాగినా ప్రమాదమే..తక్కువ తాగిన ప్రమాదమేనని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories