తృటిలో తప్పిన ప్రమాదం : విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

తృటిలో తప్పిన ప్రమాదం : విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
x
Highlights

76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో కోలకతా విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు ఎమర్జెన్సీ...

76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దాంతో కోలకతా విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయింది. శుక్రవారం గువహటికి వెళ్లా‍ల్సిన విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది. టేకాఫ్‌ తీసుకున్నకొన్నినిమిషాల్లోనే ఫైలెట్లకు ఈ విషయం అర్ధమైంది. దాంతో అత్యవసరం ల్యాండ్‌ కు ఉపక్రమించారు. ఈ విషయాన్నీ కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు దృవీకరించారు. కాక్‌పిట్లో పొగ అలారం మోగడంతో లోపాన్ని గుర్తించినట్టు వారు చెప్పారు. పైలట్‌ల అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories