మోడీ సర్కారు బంపర్ బొనాంజా..

మోడీ సర్కారు బంపర్ బొనాంజా..
x
Highlights

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్సమావేశంలో 33 రకాల వస్తువులపై జీఎస్టీ...

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్సమావేశంలో 33 రకాల వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కౌన్సిల్.. తగ్గించిన జీఎస్టీ రేట్లు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో టీవీలు, కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సాధారణ పొదుపు ఖాతాలు, జన్‌ధన్ సేవింగ్స్ ఖాతాలకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలపై జీఎస్‌టీని తొలగించారు. మారిన శ్లాబులను పరిశీలిస్తే, ఎయిర్ కండిషనర్లు, 32 ఇంచుల టీవీలు, టైర్లు, లిథియం బ్యాటరీలు, మోటార్ వెహికల్ భాగాలు, కంప్యూటర్ విడి భాగాలు, టైర్లు, వీడియోగేమ్స్‌, పవర్‌ బ్యాంకులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చారు. పై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గించారు. వీల్ చైర్స్ పై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే సినిమా టిక్కెట్లు వంద రూపాయిల కన్నా ఎక్కువ ఉంటే 28 నుంచి 18 శాతం స్లాబ్ రేట్ లోకి, 100 రూపాయిలకన్నా తక్కువ ధర ఉంటే.. 18 శాతం నుంచి 12 శాతం స్లాబ్ రేట్ లోకి వచ్చాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం విమానాల్లో ప్రయాణించేవారికి ప్రీమియం ట్యాక్స్ తొలగింపు. స్పోర్ట్స్ ఐటమ్స్ ను కూడా 28 శాతం స్లాబ్ నుంచి తొలగించారు. థర్డ్ పార్టీ బీమా 12 శాతానికి కుదించారు. ఎకానమీ క్లాస్‌పై 5శాతం, బిజినెస్‌ క్లాస్‌పై 12 శాతం జీఎస్టీ ఉంటుంది. సిమెంట్‌, ఆటోమొబైల్‌, రియల్ ఎస్టేట్ రంగాలకు మాత్రం నిరాశ మిగిలింది. సిమెంట్, ఆటోమొబైల్ రంగాలపై జీఎస్టీని తగ్గించలేమని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆ రంగాలపై జీఎస్టీ 18శాతానికి తగ్గిస్తే 33 వేల కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇక వందలకొద్దీ వస్తువులపై జీఎస్‌టీ రేట్లు తగ్గించామని అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories